రక్తదానం అంటే మరొకరికి ప్రాణం పోయడమే.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రక్త దాన శిబిరాలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. నటుడిగా ఒక స్టార్ గా ఎదిగిన తరువాత మెగాస్టార్ ఎంతో బాధ్యతాయుతంగా స్టార్ట్ చేసిన ఈ సేవా స్వచ్ఛంద సంస్థకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. అయితే నేడు వరల్డ్ బ్లడ్ డానర్ డే సందర్భంగా మెగాస్టార్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేశారు.
ఈ రోజు ఉదయమే తనకు జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన ఒక విషయం గురించి చెప్పబోతున్నాను అని ట్విట్టర్ లో పేర్కొన్న మెగాస్టార్ కరెక్ట్ గా 10గంటలకు మంచి సందేశాన్ని అందించారు. ఒకరి ప్రాణాన్ని కాపాడటం కంటే సంతృప్తికరమైన గొప్ప విషయం మరొకటి ఏం ఉంటుంది.. ఎన్నో సార్లు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది.
ప్రజలు రక్తదానం చేస్తున్నారని నేను విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది, దేవుడు మానవాళికి ఇచ్చిన సూపర్ పవర్ ఇదే అంటూ.. రక్తదానం చేస్తున్న శక్తివంతులకు కృతజ్ఞతలు అని పేర్కొన్నారు.

అలాగే రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి అంటూ మెగాస్టార్ అభిమానులకు ఒక వీడియో ద్వారా కూడా పిలుపునిచ్చారు. ఆ వీడియోలో మెగాస్టార్ రక్తదానం చేసినప్పటి ఫొటోలు ఉన్నాయి. మెగాస్టార్ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











