Chiranjeevi: మెగా అభిమానులకు మరో సర్‌ప్రైజ్.. అలా ప్లాన్ చేస్తున్న చిరంజీవి!
మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనం సృష్టించింది. కేవలం మెగా అభిమానులకు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఈ సినిమా మంచి ట్రీట్ ఇచ్చింది. ఇరు వర్గాల అభిమానులు కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ లో నెంబర్ వన్ రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఇక మెగా ఫ్యామిలీ నుంచి రానున్న రోజుల్లో మరిన్ని బిగ్ బడ్జెట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ప్రస్తుతం అందరి ఫోకస్ అయితే ఆచార్య సినిమా పైనే ఉంది. గత ఏడాది నుంచి వాయిదా పడుతున్న ఈ సినిమా ఎట్టకేలకు ఏప్రిల్ నెలలో విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ ప్రమోషన్స్ లో కూడా స్పీడ్ పెంచాలి అని చూస్తున్నారు. గతంలోనే మూడు పాటలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక విడుదలైన మూడు పాటలు కూడా యూట్యూబ్ లో భారీ స్థాయిలో వ్యూవ్స్ అందుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో కూడా సరికొత్త స్టెప్పులతో అభిమానులకు మంచి కిక్కు ఇవ్వబోతున్నాడని కూడా అర్థమైంది.

ఇక త్వరలోనే ఆచార్య సినిమా నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ కాబోతునట్లు సమాచారం. ఏప్రిల్ 29వ తేదీన భారీ స్థాయిలో విడుదల కానున్న ఆచార్య సినిమా ట్రైలర్ ను విడుదల చేయాల్సి ఉంది. అంతే కాకుండా మరో రెండు పాటలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఇక రాబోయే శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన ఆచార్య సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన అప్డేట్ ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ రోజు ప్రత్యేకంగా ఏదైనా స్పెషల్ టీజర్ విడుదల చేస్తారా లేదంటే ట్రైలర్ అప్డేట్ ఏమైనా ఇస్తారా అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కానీ తప్పకుండా శ్రీరామనవమి సందర్భంగా ఒక మంచి అప్ డేట్ అయితే ఇస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన పాట కూడా ఉంటుందట. ఆ పాటలో చిరు అలాగే చరణ్ ఇద్దరు కూడా వారి స్టెప్పులతో అభిమానుల చేత విజిల్స్ వెయిస్తారని తెలుస్తోంది.
కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ అలాగే మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ లో నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇక మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జోడీగా పూజాహెగ్డే నటించింది. ఈ సినిమాకు మణిశర్మ తనదైన శైలిలో సంగీతం అందించాడు. ఇక సోనుసూద్ కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వెన్నెల కిషోర్ పోసాని కృష్ణ మురళి తనికెళ్ల భరణి అలాగే మరికొంతమంది ప్రముఖ నటి నటులు ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. ఫైనల్ గా ఏప్రిల్ 29న రాబోయే ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











