తెలంగాణ ముఖ్యమంత్రికి మెగాస్టార్, మహేష్ బర్త్ డే విషెస్.. స్పెషల్ ఫొటో వైరల్
తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక సినీ ప్రముఖులు కూడా కకేసిఆర్ కు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ ను అందించారు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మెగాస్టార్ చిరంజీవి, సీఎం కేసీఆర్ ఇద్దరికి కూడా మంచి సాన్నిహిత్యం ఉంది. పలు కార్యక్రమాల్లో కూడా కలుసుకున్నప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇక మెగాస్టార్ తన ట్విట్టర్ ద్వారా ఈ విధంగా కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 'గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కే సి ఆర్ గారికి హార్దిక జన్మ దిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో వుండాలని, మీ లక్ష్యసాధనకి, ప్రజాసేవకి మీకు ఆ భగవంతుడు అపరిమిత శక్తి సామర్ధ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.." అంటూ వివరణ ఇచ్చారు. అంతే కాకుండా మెగాస్టార్ కేసీఆర్ తో ఉన్న ఒక ఫొటోను కూడా షేర్ చేసుకున్నారు. ఇక మెగాస్టార్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరికొందరు కేసీఆర్ అభిమానులు సైతం చిరంజీవి చెప్పిన విషెస్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇమా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరితో మంచి సాన్నిహిత్యం కలిగి ఉంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఇండస్ట్రీ తరపున మాట్లాడిన విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలోని సమస్యలు అలాగే సినిమా టికెట్ల రేట్ల విషయంలో కూడా మరోసారి ఆలోచించాలని విన్నవించుకున్న విధానం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక మెగాస్టార్ తీసుకున్న చొరవకు చాలామంది ప్రశంసలు కురిపించగా మరికొందరు మాత్రం విభేదించారు.
ఇక కేసీఆర్ తో కూడా మెగాస్టార్ చిరంజీవి మరోసారి సినిమా ఇండస్ట్రీ కోసం చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు మహేష్ బాబు కూడా కకేసిఆర్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఆయన నిండు ఆరోగ్యంతో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలని ట్విట్టర్ ద్వారా సూపర్ స్టార్ వివరణ ఇచ్చారు. అందుకు సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ప్రస్తుతం మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా సమ్మర్ కానుకగా మే 13న విడుదల కానుంది. ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్, రాజమౌళి సినిమాలను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఆ సినిమాను కూడా హిందీలో భారీగా విడుదల చేయాలని ఇటీవల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇక మెగాస్టార్ ఆ తరువాత బోళా శంకర్ సినిమాతో పాటు గాడ్ ఫాదర్ సినిమాలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని అనుకుంటున్నాడు. అలాగే బాబీ, వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ఒప్పుకున్నాడు.


Click it and Unblock the Notifications











