మెగాస్టార్ మరో లాంగ్ బ్రేక్.. రామ్ చరణ్ కూడా.. ఇప్పట్లో ఆ పనులు పూర్తికానట్లే

మెగాస్టార్ చిరంజీవి సైరా అనంతరం ఎంతో వేగంగా సెట్స్ పైకి తెచ్చిన చిత్రం ఆచార్య. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి కూడా ఏదో ఒక విదంగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. సాధారణంగా దర్శకుడు కొరటాల శివ ఒక సినిమాను స్టార్ట్ చేస్తే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో ఉంటాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే ఆచార్య సినిమాకు మరోసారి బ్రేక్ పడింది. ఇటీవల కోవిడ్ కేసులు తీవ్రంగా పెరగడంతో షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న విషయం తెలిసిందే. కేవలం 15 రోజుల షూటింగ్ వర్క్ మాత్రమే మిగిలి ఉందట. అయితే కరోనా తీవ్రంగా పెరగడంతో మళ్ళీ క్యాన్సిల్ అయినట్లు సమాచారం. కొరటాల శివ రెడీగా ఉన్నప్పటికీ మెగాస్టార్ ఇప్పట్లో షూటింగ్ స్టార్ట్ చేసే ఇంట్రెస్ట్ చూపడం లేదట. చిత్ర యూనిట్ లో ఏవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే షూటింగ్ ను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Megastar chiranjeevi another long break acharya shooting update

మరోవైపు రామ్ చరణ్ కూడా అదే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. RRR షూటింగ్ కు కూడా బ్రేక్ వేయక తప్పలేదు. రాజమౌళి షూటింగ్ అంటే సెట్స్ లో కనీసం 70 మంది అయినా ఉండాల్సిందే. కొన్ని వార్ ఫైట్స్ మిగిలి ఉండడంతో తరువాత చేద్దామని రీ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఆచార్య సినిమా రిలీజ్ వాయిదా పడగా త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X