65ఏళ్ళ వయసులో మెగాస్టార్ బిగ్ చాలెంజ్.. ఒకేసారి రెండు బిగ్ బడ్జెట్ సినిమాలు!
మెగాస్టార్ చిరంజీవి ఏం చేసినా కూడా అభిమానుల్లో ఒక స్పెషల్ ఎట్రాక్షన్ ని క్రియేట్ చేస్తుంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ తన సినిమాలకు సంబంధించి ఒక కొత్త తరహా నిర్ణయాలను తీసుకుంటున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన తరువాత మెగాస్టార్ ఒక సినిమా పూర్తయిన తరువాతనే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నారు.

వీలైనంత త్వరగా పూర్తి చేయాలని
ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా షూటింగ్ ఇంకా సగానికి పైగా పూర్తి కావాల్సి ఉంది. కరోనా వైరస్ తీవ్రత తగ్గిన తరువాత ఆ సినిమా పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. అనంతరం మరో రెండు సినిమాలను స్టార్ట్ చేయనున్నారు.

మెగాస్టార్ దూకుడు చూస్తుంటే
మెగాస్టార్ దూకుడు చూస్తుంటే ఒకేసారి రెండు డిఫరెంట్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు రెండు కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరు ఈ బర్త్ డేకు స్పెషల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. దర్శకులు ఆల్ మోస్ట్ మెగాస్టార్ కోసం కథలను అయితే పూర్తిగా సిద్ధం చేసినట్లు సమాచారం.

ఆ ఇద్దరు దర్శకులతో..
పవర్, జై లవకుశ, వెంకీమామ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బాబీ కొన్ని వారాల నుంచి మెగాస్టార్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు. బాబీ చెప్పిన మెయిన్ పాయింట్ నచ్చడంతో మెగాస్టార్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారట. ఇక మెహర్ రమేష్ తో మాత్రం వేదళం రీమేక్ ని తెరకెక్కించాలని మెగాస్టార్ సరికొత్తగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

ఒకేసారి మొదలుపెట్టాలని
ఇక ఈ రెండు సినిమాలను కూడా మెగాస్టార్ ఒకేసారి మొదలుపెట్టాలని ట్రై చేస్తున్నారట. 65ఏళ్ళ వయసులో మెగాస్టార్ ఈ షూటింగ్స్ ని ఛాలెంజ్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా ఆ సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. గ్యాప్ లేకుండా ఒకేసారి రెండు ప్రాజెక్టులను చేస్తున్నాడు అంటే గ్రేట్ అని చెప్పాలి. కుదిరితే రెండు సినిమాలను కూడా పెద్దగా గ్యాప్ లేకుండానే రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











