HBD Chiranjeevi : లగ్జరీ కార్లు, బిల్డింగ్‌లు ఇంకా .. మెగాస్టార్ చిరంజీవి ఆస్తులు అన్ని కోట్లా ..?
కొణిదెల శివశంకర వరప్రసాద్.. అలియాస్ చిరంజీవి. మూడున్నర దశాబ్థాలుగా తెలుగు తెరను మకుటం లేని మహారాజుగా ఏలుతున్న పేరు. కృషి, పట్టుదల, ప్రతిభ వంటి ఎంతటి సామాన్యుడైనా .. అసాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిరూపించిన వ్యక్తి చిరంజీవి. సుప్రీంహీరో నుంచి మెగాస్టార్‌గా ఎదిగినా.. నేటికీ ఆయన స్వయంకృషినే నమ్ముకున్నారు. డ్యాన్సులు, ఫైట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమకు దూకుడుని పరిచయం చేసి టాలీవుడ్‌కి తానే ఐకాన్‌గా మారారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసి తెలుగు సినిమా మార్కెట్‌ను, స్థాయిని పెంచారు చిరు. ఆగస్ట్ 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా మెగాస్టార్ గురించి ఆసక్తికర విశేషాలు.
ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజులు తెలుగు తెరను ఏలుతున్న సమయంలో 1978లో పునాదిరాళ్లు ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సెకండ్ హీరోగా, సహాయ నటుడిగా, విలన్‌గా ఇలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీతో చిరంజీవికి స్టార్‌డమ్, మాస్ ఇమేజ్ వచ్చింది. మెగాస్టార్ కెరీర్‌ను ఖైదీకి ముందు.. ఖైదీకి తర్వాత పేర్కొంటారంటే ఈ సినిమా ఆయన జీవితంపై వేసిన ముద్రను అర్ధం చేసుకోవచ్చు. ఖైదీ తర్వాత వెనుదిరిగే అవకాశం లేకుండా వరుస హిట్లతో ప్రభంజనం సృష్టించారు చిరంజీవి.

తొలి రోజుల్లో సుప్రీంహీరోగా అభిమానుల చేత పిలిపించుకున్న చిరు.. మరణ మృదంగం నుంచి మెగాస్టార్‌గా మారారు. పసివాడి ప్రాణం సినిమాతో బ్రేక్ డ్యాన్స్‌ని తెలుగువారికి పరిచయం చేశారు. భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడు చిరంజీవే . దీంతో నాటి పత్రికలు, మ్యాగజైన్స్ ఆయనను బిగ్గెర్ దెన్ బిగ్ బీ అంటూ కీర్తించాయి. 1999-2000 ఆర్ధిక సంవత్సరానికి గాను అత్యధిక పన్ను చెల్లించినందుకు గాను చిరంజీవిని సమ్మాన్ అవార్డ్‌తో భారత ప్రభుత్వం సత్కరించింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవి. ఘరాన మొగుడు రూ.10 కోట్ల గ్రాస్ వసూలు చేసిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో మెగాస్టార్‌ను గౌరవించింది భారత ప్రభుత్వం.
తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లతో పాటు రాజకీయాల్లోకి వచ్చి తనకు చేతనైనంతలో ప్రజాసేవ చేశారు. ఇప్పటికీ సినీ కళాకారులు, సామాన్యులు కష్టాల్లో ఉంటే తక్షణం స్పందించి వారి సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తారు చిరంజీవి. మొన్నామధ్య వయనాడ్‌లో వరదల వల్ల నష్టపోయిన వారికి అండగా నిలిచిన ఆయన తన కుమారుడు రామ్ చరణ్‌తో కలిసి సంయుక్తంగా రూ.కోటిని కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేశారు.

40 ఏళ్ల సినీ కెరీర్, 150కి పైగా సినిమాలు చేసిన చేసిన చిరంజీవి ఎన్ని కోట్ల ఆస్తులను సంపాదించారనే ప్రశ్న నెటిజన్లకు వస్తుంటుంది. ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవి ఆస్తుల విలువ రూ.2 వేల కోట్ల పై మాటేనట.. ఒక్కో సినిమాకు రూ. 40 నుంచి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే చిరంజీవి తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టారట. కోట్లు విలువజేసే లగ్జరీ కార్లు, సొంతంగా ప్రైవేట్ జెట్‌తోపాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలో విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి.
వీటి విలువ వందల కోట్లలో ఉంటుందని అంచనా. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా మరిన్ని సినిమాలలో నటిస్తూ.. ఆయన ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఫిల్మీబీట్ తరపున మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











