Mega Macho Event: గోపిచంద్ కోసం రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి.. కమర్షియల్ ప్లాన్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. అతను ఎలాంటి సినిమా చేసినా కూడా మాస్ ఆడియెన్స్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తూ ఉంటుంది. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల తరహాలోనే గోపిచంద్ సినిమాలు కూడా భారీ స్థాయిలోనే కలెక్షన్స్ అందుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో గోపిచంద్ వరుస అపజయల కారణంగా అతనికి కొంత మార్కెట్ అయితే తగ్గింది.

ఇక ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో మాత్రం బాక్సాఫీసు వద్ద మంచి సక్సెస్ అందుకోవాలి అని చూస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో గోపీచంద్ ఒక లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫుల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో రాశిఖన్నా మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Megastar chiranjeevi chief guest for gopichand pakka comercial movie

ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 26వ తేదీన హైదరాబాదులోనే పక్కా కమర్షియల్ ఈవెంట్ సినిమా నిర్వహించబోతున్నారు. ఇక సినిమాను జూన్ ఒకటో తేదీన విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోని ఒక ప్రముఖ ప్లేస్ లో భారీ స్థాయిలో నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

గోపీచంద్ తండ్రి T కృష్ణ గారు అంటే అప్పట్లో మెగాస్టార్ ఎంతగానో అభిమానించేవారు. ఇక ఆయన పై అభిమానంతోనే మెగాస్టార్ గోపీచంద్ కోసం ప్రత్యేకంగా వేడుకకు రాబోతున్నట్టు సమాచారం. దీన్ని మెగా మ్యాచో ఈవెంట్ గా నిర్వహించనున్న నిర్మాతలు ఈ సినిమాకు భారీ స్థాయిలోనే హైలెట్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇది వరకే ఈ సినిమాకు ట్రైలర్ ద్వారా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్ చేయాలని అనుకుంటున్నారు. మరి పక్కా కమర్షియల్ సినిమా కమర్షియల్గా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X