twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    43 Years Of Megastar: నటుడిగా నేను పుట్టినరోజు.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ వైరల్!

    |

    టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎంతోమంది అగ్రహీరోలు వారి కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని క్రేజ్ ను సెట్ చేసుకున్నారు. ఒక విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ తరువాత ఎక్కువగా ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఏకైక హీరో మెగాస్టార్ అని చెప్పవచ్చు. టాలీవుడ్ సినిమా మార్కెట్ స్థాయి పెరగడంతో కూడా మెగాస్టార్ స్టార్ హోదా ఎంతగానో ఉపయోగపడింది. అలాగే రెమ్యునరేషన్ లో కూడా ఆయన అప్పట్లో బాలీవుడ్ హీరోలను సైతం అధిగమించారు. చిరంజీవి లాంటి హీరో మరొకరు లేరని ఇకపైన పుట్టరు అని కూడా ఎంతోమంది ప్రముఖ నటీనటులు ఓపెన్ గా తెలియజేశారు.

    నేటితరం స్టార్ హీరోలు కూడా మెగాస్టార్ ను ఎంతో స్పూర్తిగా తీసుకుంటారు. మొదటి నుంచి కూడా ఎంతో క్రమశిక్షణతో సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగాస్టార్ సోలోగా సినిమా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ కాలంలోనే మెగాస్టార్ గా ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇక మెగాస్టార్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేవలం సినిమాలలోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ఆయన అడుగులు వేశారు. అలాగే కష్టాల్లో ఉన్న పేద ప్రజలకు ఎన్నో సార్లు తన వైపు నుంచి కూడా సహాయలు చేశారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు.

     Megastar chiranjeevi complete 43 years of tollywood career

    ముఖ్యంగా అభిమానుల్లో ఎవరు కష్టాల్లో ఉన్నారని తెలిసినా కూడా వారిని ప్రత్యేకంగా దగ్గరికి తీసుకొని తనకు తోచిన సహాయం చేస్తూ వస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేటితో 43 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో తన జీవిత గమనాన్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి నటించిన మొదటి సినిమా ప్రాణం ఖరీదు 1978 సెప్టెంబర్ 22న విడుదల అయింది. ఆ సినిమాతోనే నటుడిగా కొణిదెల శివప్రసాద్ కెరీర్ చిరంజీవిగా మొదలైంది.

    ఇక ఆ తర్వాత ఏ మాత్రం వెనక్కి తిరిగి చూసుకోకుండా 43 ఏళ్లుగా మెగాస్టార్ స్టార్ హెడతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందించారు. ఆగస్ట్ 22 నేను పుట్టినరోజైతే సెప్టెబరుర్ 22 నటుడిగా నేను పుట్టినరోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయంచేసి మీ ఆశీస్సులు పొందినరోజు. నేను మరిచిపోలేనిరోజు. ఈ రోజు నా సోదరులు మరియు సోదరీమణుల యొక్క అమూల్యమైన లక్షలాది మంది ప్రేమ కోసం వినయపూర్వకంగా మరియు కృతజ్ఞతగా తెలుపుతున్నాను అని మెగాస్టార్ చిరంజీవి వివరణ చ్చారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుసగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే ఆరు పదుల వయసులో కూడా మెగాస్టార్ చిరంజీవి ఏ మాత్రం అలసిపోకుండా మంచి ఎనర్జీతో వర్క్ చేస్తున్నారు.

    English summary
    Megastar chiranjeevi complete 43 years of tollywood career
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X