సైరాలో డాన్సులు.. కండిషన్ పెట్టిన చిరంజీవి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహారెడ్డి అతంత్య ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ లో రూపొందుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. చిరంజీవి తొలి సారి ఇలాంటి చిత్రంలో నటిస్తునడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
టాలీవుడ్ లో డాన్సులు అంటే మొదట గుర్తుకు వచ్చేది చిరంజీవి. మెగాస్టార్ డాన్సులు అభిమానులు విజిల్స్ పెట్టే విధంగా ఉంటాయి. కమర్షియల్ చిత్రాల తరహాలో సైరా చిత్రంలో డాన్సులు పెట్టడానికి కుదరదు. దేశభక్తి, స్వాత్రంత్ర సమరం నేపథ్యంలో వస్తున్న చిత్రం కావడంతో చిరు డాన్సులపై ప్రత్యేక దృష్టి పెట్టారట.

ఈ చిత్రానికి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అప్పటి కాలం నాటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటూనే అభిమానులకు కొత్త అనుభూతి కలిగించేలా ఈ చిత్రంలో డాన్సులు ఉండాలని చిరు శేఖర్ మాస్టర్ కు సూచించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











