జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలి అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్.. ఫ్యామిలీ ఫొటో వైరల్
మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఎంతగా ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా వీలైనంత వరకు ఖాళీ సమయాల్లో కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తన తల్లిని కూడా ప్రత్యేకంగా గౌరవిస్తూ ఉంటాడు. ఎన్నోసార్లు చిరంజీవి తన తల్లికి తనే స్వయంగా వండి పెట్టిన సందర్భాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి తన తల్లి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా విషెస్ అందిస్తూ ఒక ఫ్యామిలీ ఫోటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అందులో నాగబాబు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ఇద్దరు సోదరీమణులు కూడా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవి పుట్టినరోజు కావడంతో ఆయన ప్రత్యేకంగా విషెస్ అంధించి ఈ విధంగా వివరణ ఇచ్చారు.

మాకు జన్మని జీవితాన్ని ఇచ్చిన అమ్మ పుట్టినరోజు.. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే అమ్మ అని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ గా ఒక వివరణ ఇచ్చారు. ఇక ఆ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలో ఉండడంతో వారి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఆ ఫోటోను మరింత వైరల్ అయ్యేలా షేర్ చేస్తున్నారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా భోళా శంకర్ తో రెడీ అవుతున్న విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి రాబోతున్న ఆ సినిమాను ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా ఇదే ఎడాది ప్రేక్షకులు ముందుకు రావచ్చు అని తెలుస్తోంది. ఇక మరోవైపు నాగబాబు రెగ్యులర్ పాలిటిక్స్ లో జనసేనతో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











