Megastar కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. ఏకంగా 500 కిమీ పాదయాత్ర.. మైగాడ్!
ఈ మధ్యకాలంలో ఫ్యాన్స్ తమ అభిమాన హీరో హీరోయిన్లను కలవడానికి ఎంత సాహసానికి అయినా ఒడిగడుతున్నారు.. కొద్ది రోజుల క్రితం తన అభిమాన నటుడు సోనూసూద్ ను కలవడం కోసం ఏకంగా హైదరాబాద్ నుంచి ముంబై దాకా పాదయాత్ర చేసిన ఘటన మరువక ముందే రష్మిక కోసం ఒక వ్యక్తి ముంబై వెళ్ళాడు. ఆ తరువాత మళ్ళీ తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను కలిసేందుకు వచ్చారు. ఇప్పుడు వాటి అన్నింటి కంటే భిన్నమైన ఒక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

దివ్యాంగుడు
తాజాగా మెగాస్టార్ చిరును కలిసేందుకు ఒక దివ్యాంగ(వికలాంగ) అభిమాని పాదయాత్ర ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు సదరు అభిమాని పాదయాత్ర చేస్తున్నారు. అమలాపురం నుంచి హైదరాబాద్ లోని చిరంజీవి నివాసం వరకు ఈ పాదయాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.

500 కిలోమీటర్ల పాదయాత్ర
తూర్పు గోదావరి జిల్లా అమలాపురం తాలూకా ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్ అనే అభిమాని కాలినడకన సోమవారం నాడు హైదరాబాద్ బయలు దేరాడు. అక్కడినుంచి చిరు ఇల్లు సుమారు 500 కిలోమీటర్లు చిరంజీవి నటించిన మాస్టర్ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్ చెబుతున్నారు.

కలిస్తే చాలు
తన ఆరాధ్య నటుడు అయిన చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, నాకు ఆయన అంటే ఇష్టం అని, ఎంత కష్టమైనా భరించి ఆయనను కలుస్తానని గంగాధర్ చెబుతున్నారు. పాదయాత్ర చేసి చిరు ఇంటికి వెళ్లి చిరంజీవిని కలుస్తానంటున్న గంగాధర్, తాను చూసిన మొదటి సినిమా మాస్టర్ అని అందుకే ఆ సినిమా విడుదలైన రోజునే పాదయాత్ర మొదలు పెట్టానని అన్నారు.

అంగవైకల్యం అడ్డు కాదు
ఇక ఒంటిపై చిరంజీవి ఫోటోతో ముద్రించిన టీ షర్ట్ వేసుకుని పాదయాత్ర చేస్తున్న గంగాధర్.. తన పాదయాత్రకు అంగవైకల్యం అడ్డుకాదని అవసరమైతే చిరంజీవి కోసం ప్రాణమైన ఇస్తానని చెబుతున్నారు. అంతే కాక ఆయన ఎక్కడ కనిపించినా మెగాస్టార్ అభిమానులు అండగా నిలుస్తున్నారు. తమకు వీలైన సహాయం చేస్తున్నారు. మరి ఆయన హైదరాబాద్ వచ్చాక మెగాస్టార్ కలుస్తారో లేదో చూడాలి మరి.

సినిమాల విషయానికి వస్తే
ఇక చిరు తన అభిమానులు అంటే ప్రాణం ఇస్తారు. ఎప్పటికప్పుడు తన అభిమానులతో టచ్ లో ఉండే చిరంజీవి ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో మరింత చేరువయ్యారు అని చెప్పవచ్చు. ఇక చిరంజీవి చేస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

షూట్ బిజీలో
కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 17 వ తేదీన విడుదల అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి ఇప్పటికే ప్రకటించిన భోళా శంకర్, గాడ్ ఫాదర్, వాల్తేరు వీర్రాజు సినిమాల్లో బిజీ కానున్నారు. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ ఊటీలో జరుగుతోంది.


Click it and Unblock the Notifications











