Shiva Shankar మాస్టర్ కుటుంబానికి మెగా సాయం.. డాక్టర్లతో మాట్లాడానన్న విష్ణు!

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ అనారోగ్య కారణాలతో ప్రస్తుతం హాస్పిటల్ పాలైన సంగతి తెలిసిందే.. కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన చికిత్స కోసం సాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు..తాజాగా చిరంజీవి, మంచు విష్ణు తదితరులు ఆయనకు సాయం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన ఆయన గచ్చిబౌలిలోని ఏ ఐ జి హాస్పిటల్ లో క్రిటికల్ కేర్ లో వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. దురదృష్ట వశాత్తు ఆయన భార్యకి కూడా కరోనా సోకడంతో ఆమె ఇంట్లోనే క్వారెంటైన్ లో ఉంటున్నారు. శివ శంకర్ మాస్టర్ పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకడంతో ఆయన కూడా చికిత్స పొందుతున్నారు.

ఈ కుటుంబానికి కేవలం చికిత్స కోసమే రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుండడంతో శివ శంకర్ మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ తనకు సహాయం అందించవలసిందిగా సినీ పెద్దలను కోరారు. ముందుగా స్పందించిన సోనూ సూద్ తాను అండగా ఉంటానని చెప్పడమే కాక కుమారుడు అజయ్ తో కూడా మాట్లాడాడు. ఇక తమిళ హీరో ధనుష్ కూడా ఆయనకు సహాయం అందిస్తానని ముందుకు వచ్చారు. అలాగే శివ శంకర్ మాస్టర్ గురించి తెలిసిన వెంటనే చిరంజీవి హుటాహుటిన అజయ్ కి ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నారు. తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కుని మెగాస్టార్ చిరంజీవి శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అందజేశారు. అలాగే శివ శంకర్ మాస్టర్ వైద్యానికి సంబంధించి అందిస్తున్న పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శివ శంకర్ మాస్టర్ కు టాలీవుడ్ తరపున మేమంతా ఉన్నాం అని అభయమిచ్చారు. చిరంజీవిని కలిసి చెక్ తీసుకున్న తర్వాత అజయ్ మాట్లాడుతూ "నాన్న గారికి అనారోగ్యం అనే సంగతి తెలిసిన వెంటనే చిరంజీవి గారు ఫోన్ చేసి పిలిపించారని, తక్షణ సాయంగా మూడు లక్షల రూపాయల చెక్కును అందించారు అని వెల్లడించారు. చిరంజీవి గారు అంటే నాన్న గారికి ఎంతో అభిమానం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారితో సినిమాలు నాన్న గారు కలిసి చేశారని వెల్లడించారు.

 megastar Chiranjeevi financial help of 3 lakhs to shiva Shankar master family

ఇక ఇటీవల ఆచార్య షూటింగులో కూడా నాన్నగారు చిరంజీవిని కలిశారని అజయ్ గుర్తుచేసుకున్నారు. ఇలాంటి సమయంలో ప్రతి రూపాయి తనకి చాలా అవసరం అని పేర్కొన్న అజయ్ చిరంజీవి గారు చేసిన సాయం ఎన్నటికీ మరువలేని ఆయనకి ఎన్నటికీ రుణపడి ఉంటానని అజయ్ అన్నారు. మరో పక్క తాజాగా నటుడు, మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) అధ్యక్షుడు మంచు విష్ణు సైతం స్పందించారు. శివశంకర్ మాస్టర్ ఆరోగ్యంపై ఏఐజీ వైద్యులతో మాట్లాడినట్లు ఆయన ట్విటర్‌ వేదికగా తెలిపారు. ఈ మేరకు విష్ణు ట్వీట్‌ చేస్తూ.. 'శివ శంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యంపై ఆరా తీశాను. ఆయనకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరానన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X