For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్నీ అబద్దాలే... ఇక్కడ ప్రొడ్యూసర్ తిడితే, అక్కడ మరోలా చెబుతారు: చిరంజీవి

|

తెలుగు సినీ ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ యూనియన్‌ 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో 'సినీ మహోత్సవం' పేరుతో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ.... తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ మేనేజర్ల గెరించి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. వీరు ఆడే అబద్దాలు ఎవరూ ఆడరు అంటూ చిరంజీవి తనదైన శైలిలో చమత్కరిస్తూ హాస్యం పండించే ప్రయత్నం చేశారు.

ప్రొడ్యూసర్లకు కోపం వచ్చినపుడు...

ప్రొడ్యూసర్లకు కోపం వచ్చినపుడు...

నటీనటులు ఎవరైనా సమయానికి సెట్‌కు రాకుంటే ప్రొడ్యూసర్లకు కోపం వస్తుంది... వెంటనే మేనేజర్లను పిలిచి ఏంటయ్యా చిరంజీవి ఇంకా రాలేదేంటి, ఆ హీరోయిన్ ఏమిటీ ఇంకా రాలేదు... సమయానికి రాకుండా మా ప్రాణాలు తీసేస్తున్నారు అని కోపగించుకున్నపుడు.... మీరు కంగారు పడకుండి, మేము చూసుకుంటామని చెప్పి వారు కూల్ అయ్యేలే చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

ఇక్కడ ప్రొడ్యూసర్ తిడితే, అక్కడ ఇంకోలా చెబుతారు

ఇక్కడ ప్రొడ్యూసర్ తిడితే, అక్కడ ఇంకోలా చెబుతారు

వెంటనే ఆ హీరోయిన్ దగ్గరకో, ఆ హీరో దగ్గరకో వెళ్లి... అమ్మా మీ గురించి ప్రొడ్యూసర్ అద్భుతంగా చెబుతున్నాడమ్మా... మీరు లేనిదే ఈ సినిమా జరిగే ప్రసక్తే లేదంటున్నాడు, మిమ్మల్ని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు చేసే కో-ఆపరేషన్ అంతా ఇంతా కాదు అంటూ.... ప్రొడ్యూసర్ చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా చెప్పి ఆ హీరో లేదా హీరోయిన్‌ సంతోష పడేలా చేస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు.

కోపతాపాలు లేకుండా సెట్లో అందరి మధ్య సుహృద్భావ వాతావరణం

కోపతాపాలు లేకుండా సెట్లో అందరి మధ్య సుహృద్భావ వాతావరణం

కోపతాపాలు లేకుండా సెట్లో అందరి మధ్య మేనేజర్లు ఒక సుహృద్భావ వాతావరణం ఏర్పాటు చేస్తారు. దీంతో ఎలాంటి ఆటంకం లేకుండా అంతా సజావుగా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఒక సినిమా నిర్మాణంలో ప్రొడక్షన్ మేనేజర్లు చాలా కీలకంగా ఉంటారని చిరంజీవి వ్యాఖ్యానించారు.

సినీ మహోత్సవం

సినీ మహోత్సవం

ఈ సినీ మహోత్సవంలో చిరంజీవి, మహేష్ బాబు, కృష్ణ, కోటా శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, టి.సుబ్బిరామిరెడ్డి, రాజేశేఖర్, జయప్రద, సుమలత, జయసుధ, రోజా రమణి, జీవిత రాజశేఖర్, అల్లు అరవింద్, సురేష్ బాబు, నిహారిక, నాగబాబు, రామ్ లక్ష్మణ్, సందీప్ కిషన్, రాశి ఖన్నా, రెజీనా, ప్రగ్యా జస్వాల్, పూజా హెగ్డే, ఎమ్.ఎల్.కుమార్ చౌదరి, గిరిబాబు, శ్రీకాంత్, అశ్వినిదత్, బోయపాటి శ్రీను, సాయి ధరమ్ తేజ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
The Silver Jubilee function was held on the occasion of 25 years of the Telugu Cinema Industry Production Managers Union. Chiranjeevi, Mahesh Babu and Union Minister Kishan Reddy attended the ceremony in Hyderabad on Sunday night.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more