మెగాస్టార్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే రీ రిలీజ్.. దీని కోసమే వెయిటింగ్!

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని చిత్రాలు ఉన్నాయి. అందులో కొన్ని ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు. ఇప్పటికి కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫేవరెట్ మూవీస్ వందల సంఖ్యలో ఉంటాయి అని చెప్పవచ్చు. మెగాస్టార్ చిరంజీవి 150 సినిమాలు పూర్తి చేసుకున్నా కూడా ఇంకా అదే స్థాయిలో గుర్తింపు అందుకుంటున్నారు అంటే ఆయన క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మెగాస్టార్ చిరంజీవి మాస్ ఆడియన్స్ ను ఎక్కువగా ఆకట్టుకునే ప్రయత్నంలో చేసిన సినిమాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఇక అందులో ముఖ్యంగా గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1991లో విజయ బాపినీడు దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి యాక్షన్ తో పాటు బప్పీలహరి అందించిన పాటలు అలాగే విజయశాంతి నటన ఇలా అన్నీ కూడా సినిమాకు ఎంతగానో హెల్ప్ ఆయాయు.

 Megastar chiranjeevi gang leader movie re release date fix

ముఖ్యంగా మెగాస్టార్ అయితే కామెడీ టైమింగ్ కూడా ఇందులో హైలెట్ గా నిలిచింది. విజయశాంతి మెగాస్టార్ డ్యాన్స్ కూడా మరింత హైలెట్ అని చెప్పవచ్చు. అయితే అలాంటి గ్యాంగ్ లీడర్ సినిమాను మరోసారి థియేటర్లో హై క్వాలిటీతో చూస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. దానికోసమే చాలా రోజుల నుంచి ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మొత్తానికి గతంలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు.

కానీ అనుకొని కారణాల వలన సినిమా క్వాలిటీ అంతగా కరెక్ట్ గా రాకపోవడంతో మళ్లీ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మొత్తానికి మార్చి 4వ తేదీన గ్యాంగ్ లీడర్ సినిమాను 4K క్లారిటీతో వెండి తెరపై విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్ మగధీర మూవీని కూడా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X