Chiranjeevi: పని మొదలు పెట్టిన మెగాస్టార్... 68 ఏళ్ల వయసులో కూడా అంటూ నెటిజన్స్ షాక్!

మెగాస్టార్ చిరంజీవి.. సినిమా కోసం ఎంత దూరమైన వెళ్తారనే సంగతి తెలిసిందే. ఆయన సినిమా చేస్తున్నారంటే.. దానికోసం 100 శాతం ఎఫెర్ట్స్ పెడతారు. అంతేనా.. ప్రతి విషయంలో జోక్యం చేసుకుని.. ముందుకు వెళ్తారు. ఇక దర్శకులకు, నిర్మాతలకు అనుకూలంగా ఉండే ఈ హీరో... తన నెక్ట్స్ సినిమా కోసం పనిమొదలు పెట్టేశారు. విశ్వంభర కోసం రెడీ అవుతున్నా అంటూ ఓ వీడియోను వదిలారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

బాసూ స్క్రీన్ మీద కనిపిస్తే.. చాలు ఫ్యాన్స్ కు కన్నుల పండుగ. గత ఏడాది చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్టును అందుకున్నాడు. ఇక ఆ తర్వాత భోళా శంకర్ సినిమాతో వచ్చి.. పరాజయం చవి చూశాడు. ఈ సినిమా ఎఫెక్ట్ తో బాసు ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ఇక అందులో భాగంగానే ఓ సోషియో ఫాంటసీ సినిమాను చేయాలని డిసైడ్ అయ్యారు. తన 156వ సినిమాగా 'విశ్వంభర'తో చిరంజీవి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Megastar Chiranjeevi Gearing Up For Vishwambhara Movie Shared Gym Video News Goes Viral

బింబిసార దర్శకుడు వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర తెరకెక్కుతుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుండగా.. చిరంజీవి ఈ సినిమాతో బియాండ్ యూనివర్స్ అంటూ కొత్త కథతో రాబోతున్నారు. ఆల్రెడీ రిలీజ్ చేసిన గ్లింప్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ మారేడుమిల్లి అడవుల్లో జరుగుతుందని సమాచారం. చిరంజీవి లేని షూటింగ్ పార్ట్ ని పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది.

విశ్వంభర సినిమా షూటింగ్ లో త్వరలోనే చిరంజీవి పాల్గొననున్నారని సమాచారం. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో ఓ సాలిడ్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసి.. నెటిజన్స్ కు షాకిచ్చారు. విశ్వంభర కోసం రెడీ అవుతున్నాను అంటూ జిమ్ లో కష్టపడుతున్న వీడియోని మెగాస్టార్ పంచుకున్నారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లో బాగా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

Megastar Chiranjeevi Gearing Up For Vishwambhara Movie Shared Gym Video News Goes Viral

జిమ్ లో అన్ని రకాల కసరత్తులు చేస్తున్న బాసును చూసిన నెటిజన్స్.. 68 ఏళ్ల వయసులో ఈ కసరత్తులు ఏంటని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో చిరంజీవి జిమ్ లోకష్టపడటం చూసి షాక్ అవుతున్నారు. సినిమా కోసం చిరంజీవి ఎంత దూరమైనా వెళ్తారనే సంగతి తెలిసిందే.. ఎంతైనా కష్టపడతారు.... ఇలా విశ్వంభర సినిమా కోసం మెగాస్టార్ కష్టపడటం చూసి సినిమా.. ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఇక ఈ విశ్వంభర సినిమా షూటింగ్ లో త్వరలో పాల్గొనున్నారు. సోషియో ఫాంటసీ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ అని టాక్ నడుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కనుంది. ఇక ఈ సినిమాపై రోజుకో వార్త బయటకు వస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X