twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోయపాటికి ఛాన్స్ దొరికినట్లేనా.. మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్!

    |

    Recommended Video

    Chiranjeevi Gives Green Signal To Boyapati Srinu | Filmibeat Telugu

    మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి తిరుగులేని విజయాలతో స్టార్ డైరెక్టర్ గా మారారు. బోయపాటి అంటే మాస్ ఆడియన్స్ కు పండగనే చెప్పొచ్చు. బోయపాటి ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో వినయ విధేయ రామ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఖైదీ నెం 150 తరువాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసేది బోయపాటి అనే వార్తలు వచ్చాయి.

    కానీ సైరా నరసింహారెడ్డి చిత్రం ప్రారంభం కావడంతో కుదర్లేదు. బాలయ్యకు రెండు సూపర్ హిట్స్ అందించిన బోయపాటి లాంటి దర్శకుడితో పనిచేయాలని చిరు కూడా ఆసక్తిగానే ఉన్నారు. తాజాగా బోయపాటికి చిరు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సైరా నరసింహారెడ్డి తరువాత కొరటాల దర్శత్వంలో చిరు నటిస్తారు. ఆ తరువాత చిత్రానికి కథ సిద్ధం చేయమని చిరు బోయపాటితో అన్నారట.

    Megastar Chiranjeevi gives green signal to Boyapati Srinu

    విభిన్నమైన అంశాలతో కథ రెడీ చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల విడుదల చేసిన వినయవిధేయ రామ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. బోయపాటి మార్క్ తో మాస్ ఆడియన్స్ ని ఈ చిత్రం అలరించడం ఖాయం అనే అంచనాలు వినిపిస్తున్నాయి.

    English summary
    Megastar Chiranjeevi gives green signal to Boyapati Srinu. After Koratala movie Chiru will going to do with Boyapati
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X