గాడ్ ఫాదర్ విషయంలో స్పీడ్ పెంచిన మెగాస్టార్.. మరో టార్గెట్ సెట్టయ్యింది!
మెగాస్టార్ చిరంజీవి ఆరు పదుల వయసులో కూడా ఏమాత్రం తీరిక లేకుండా షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. నేటి తరం యువ హీరోలు రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తేవాలి అంటేనే ఎంతో కంగారు పడుతున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలను లైన్ లో పెట్టడం విశేషం. ఒకదాని తర్వాత మరొక సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మెగాస్టార్ రెండేళ్లకు సరిపడా ప్రాజెక్టులతో అయితే బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కించాడు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ఇటీవల టీజర్ తోనే క్లారిటీ వచ్చేసింది.
ఇక ఆచార్య సినిమాను ఇదే ఏడాది విడుదల చేయాలని అనుకుంటున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల విషయంలో ఒక క్లారిటీ వస్తే గాని రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆచార్య సినిమా విడుదల కాకముందే మెగాస్టార్ చిరంజీవి మరొక మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. ముందుగా మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఒక టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. మలయాళం ఇండస్ట్రీలో బాక్స్ఆఫీస్ హిట్ గా నిలిచినటువంటి లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దర్శకుడు మోహన్ రాజా రెగ్యులర్ షూటింగ్ ను మొదలు పెట్టాడు.

ఇక ఊటిలో మరొక ముఖ్యమైన షెడ్యూల్ ను నేడు మొదలు పెట్టారు. దర్శకుడు ఈ షెడ్యూల్ లో పలు కీలకమైన సన్నివేశాలతో షూటింగ్ ను చాలా గ్రాండ్ గా మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా షూటింగ్ ను చాలా తొందరగా పూర్తి చేయాలని మెగాస్టార్ టార్గెట్ అయితే సెట్ చేసుకున్నారు. దర్శకుడు మోహన్ రాజా కూడా పర్ఫెక్ట్ ప్లాన్ తోనే పూర్తి స్క్రిప్ట్ తో సిద్ధమయ్యారు. ఒక రోజు కూడా వృధా కాకుండా ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నారు. ఇక ఈ సినిమా అనంతరం మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ కూడా దాదాపు ఫినిష్ అయింది.
ఆ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ బోలా శంకర్ అనే సినిమా చేయబోతున్నాడు. సిస్టర్ సెంటిమెంట్ తో రాబోతున్న ఆ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాపై కూడా మెగాస్టార్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. బోళా శంకర్ తమిళంలో బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మెగాస్టార్ తో సినిమా చేయాలని మారుతి గుణశేఖర్ వంటి దర్శకులు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











