twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బ్లడ్ బ్యాంక్ తరువాత.. మరో భారీ సేవకు సిద్దమైన మెగాస్టార్ చిరంజీవి.. కోవిడ్ రోగుల కోసం ప్రతి జిల్లాలో..

    |

    మెగాస్టార్ చిరంజీవి ఏ స్థాయి నుంచి వచ్చారో అందరికి తెలిసిందే. ఎంతో కష్టపడి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మెగా అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తూ ఒక మంచి నటుడిగా కూడా సక్సెస్ అయ్యారు. ఇక ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడినా కూడా అభిమానుల సపోర్ట్ లేకుంటే అది సాధ్యమయ్యేది కాదని చెబుతుంటారు. అభిమానులంటే అమితంగా ఇష్టపడే మెగాస్టార్ మరో భారీ సహాయానికి శ్రీకారం చుట్టబోతున్నారు.

    చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా

    చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా

    చిరంజీవి , రామ్ చరణ్, పవన్ కళ్యాణ్.. ఇలా మెగా ఫ్యామిలీలో ఉన్న అందరూ హీరోలు కూడా ఏదో ఒక విధంగా అవసరమైన సమయాల్లో జనాలకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక మెగాస్టార్ కెరీర్ లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి రక్తాన్ని అందించారు. అందుకు అభిమానుల సపోర్ట్ చాలానే దక్కింది.

    సమయానికి రక్తం అందక..

    సమయానికి రక్తం అందక..

    చిరంజీవి బ్లడ్ బ్యాంక్ 1998లో ఒక సంఘటన నుంచి పుట్టుకొచ్చింది. సమయానికి రక్తం అందక మనుషులు చనిపోతున్నారు అనే విషయం గురించి ఆలోచించి ఫాస్ట్ గా బ్లడ్ బ్యాంక్ ను స్థాపించారు. అది చాలా వరకు ఉపయోగపడింది. ఈ 20 ఏళ్లలో కోట్లాది మంది ప్రాణాలను రక్షించడంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతగానో హెల్ప్ అయ్యింది.

    ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్..

    ఇప్పుడు ఆక్సిజన్ బ్యాంక్..

    ఇక ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ అంతకంతకు పెరుగుతుండడంతో మెగాస్టార్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో సమయానికి ఆక్సిజన్ అందేలా ఆక్సిజన్ బ్యాంక్ కేంద్రాలను స్థాపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎవరు కూడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోవద్దని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను మరో వారం రోజుల్లో అందుబాటులోకి తేనున్నారు.

    Recommended Video

    Nayanthara ఫోటో కి ఫోజ్ ఇచ్చిందా..? అంటూ నెటిజన్ల అనుమానాలు!! || Filmibeat Telugu
    రామ్ చరణ్ కూడా..

    రామ్ చరణ్ కూడా..

    మెగాస్టార్ చిరంజీవి చేయబోతున్న ఈ భారీ సేవా కార్యక్రమాల్లో రామ్ చరణ్ కూడా బాధ్యత తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇటీవల మెగాస్టార్ కోవిడ్ వలన ప్రాణాలు కోల్పోయిన TNR కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించిన విషయం తెలిసిందే. అలాగే పావలా శ్యామలకు, తన కారావ్యాన్ డ్రైవర్ కుటుంబానికి కూడా ఆర్థికంగా సహాయం చేసి మరోసారి రియల్ హీరో అనిపించుకున్నారు.

    English summary
    In the current Covid situation to prevent deaths from lack of Oxygen supply megastar chiranjeevi has decided to start Chiranjeevi Oxygen Banks at district level.Efforts are on to make these operational within a week's time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X