వయసుతో సమానంగా మెగాస్టార్ పారితోషికం.. త్వరలోనే డబుల్ సెంచరీ..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ పై వార్తలు రావడం ఇప్పుడు కొత్తేమి కాదు. గత 30ఏళ్లుగా అత్యదిక ఆదాయం అందుకునే హీరోల్లో మెగాస్టార్ టాప్ 5లోనే ఉంటూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. అప్పట్లో ఇండియాలోనే అత్యధికంగా పారితోషికం అందుకున్న స్టార్స్ లో మెగాస్టార్ అమితాబ్ ని కూడా మించిపోయారు. ఇక ఆరు పదుల వయసులో కూడా చిరంజీవి ఆయన రేంజ్ ఏ మాత్రం తగ్గలేదని అర్ధమవుతోంది.

విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి
మెగాస్టార్ చిరంజీవి పాలిటిక్స్ కారణంగా కొన్నాళ్ళు వెండితెరకు దూరమైన విషయం తెలిసిందే. గ్యాప్ ఇవ్వడంతో బాక్సాఫీస్ రేంజ్ తగ్గి ఉండవచ్చనే టాక్ వచ్చినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద క్రియేట్ చేసిన సెన్సేషన్ తో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. ఇక ఆ తరువాత కూడా సైరా సినిమా కూడా మంచి ఓపెనింగ్స్ తో మెగాస్టార్ పవర్ స్టామినో ఏంటో అర్ధమయ్యింది.

రూ.200కోట్లు దాటే అవకాశం
అసలు మ్యాటర్ లోకి వస్తే మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ వరుసగా నాలుగైదు సినిమాలను లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. ముందుగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమాతో రాబోతున్నారు. అయితే మెగాస్టార్ ఆదాయం ఆయన తదుపరి సినిమాలా ద్వారా ఈజీగా 200కోట్లు దాటే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది.

రెమ్యునరేషన్ ఎంతంటే..
ఆచార్య సినిమాకు కొణిదెల ప్రొడక్షన్స్ తో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇక డీలింగ్స్ ప్రకారం మెగస్టార్ రెమ్యునరేషన్ రూ.50కోట్లని సమాచారం. అయితే ఆ తరువాత తెరకెక్కబోయే సినిమాలకు మాత్రం అంతకంటే ఎక్కువ రేంజ్ లో ఛార్జ్ చేయనున్నారట. దాదాపు 60కోట్లని టాక్ వస్తోంది.
Recommended Video

ఆ దర్శకులతో వరుసగా సినిమాలు
మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాలం రీమేక్ లో నటించనున్న మెగాస్టార్ ఆ తరువాత వినాయక్ లూసిఫర్ రీమేక్ అలాగే బాబీ దర్శకత్వంలో కూడా ఒక కమర్షియల్ సినిమా చేయనున్నాడు. కుదిరితే పూరి జగన్నాథ్ తో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందట. ఈ విధంగా వరుస సినిమాలతో మెగాస్టార్ తన ఆదాయాన్ని 200కోట్ల నుంచి 250కోట్ల వరకు పెంచుకునే అవకాశం ఉంది. మరి ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.


Click it and Unblock the Notifications











