Acharya: మరోసారి కీలక మార్పులు.. రన్ టైమ్ విషయంలో మెగాస్టార్ సలహా!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత గతంలో కంటే మరింత వేగంగా సినిమాలను పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. 60 ఏళ్ల వయసులో కూడా ఆయన ఏమాత్రం తగ్గకుండా యువ హీరోల కంటే వేగంగా ఎక్కువ సినిమాలను లైన్ లో పెడుతూ ఉండటం విశేషం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి లైనప్ చూస్తుంటే త్వరలోనే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసేలా ఉన్నారని అనిపిస్తోంది. కేవలం కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా మంచి సందేశాత్మక సినిమాలు కూడా చేస్తున్నారు. అంతే కాకుండా యువ దర్శకులతో కూడా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రస్తుతం అయితే అందరి ఫోకస్ కూడా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా పైనే ఉంది. ఈ సినిమాలో మెగా తనయుడు రామ్ చరణ్ తేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించిన విషయం తెలిసిందే. మొదటిసారి మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా కలిసి నటించడంతో బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. గత ఏడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఫైనల్ గా ఏప్రిల్ 29వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు.

Megastar chiranjeevi key decision for acharya final cut run time

ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో ఆచార్య విడుదల అవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన అనేక రకాల కథనాలు కూడా వైరల్ అవుతున్నాయి. దర్శకుడు కొరటాల శివ సినిమా ఫైనల్ కట్ కూడా రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా మొత్తం మూడు గంటల నిడివి ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి అసంతృప్తి చెందినట్లు సమాచారం. వెంటనే రన్ టైమ్ తగ్గించాలని ఆయన సలహాలు ఇచ్చారట.

ప్రతి సన్నివేశం కూడా అద్భుతంగా వచ్చినప్పటికీ కూడా మూడు గంటల నిడివి అంటే ప్రేక్షకులు అంత ఓపిక ఉండదు అని మళ్ళీ సినిమాకి రావాలా వద్దా అనే ఆలోచన కూడా ఇతర ప్రేక్షకులు ఉండవచ్చు అనే ఆలోచనతో సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన సలహాలతో దర్శకుడు కొరటాల శివ మరొకసారి ఆచార్య సినిమాకు సంబంధించిన ఎడిటింగ్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు సినిమా నిడివిని తగ్గించాలని మెగాస్టార్ సూచించారట.

Megastar chiranjeevi key decision for acharya final cut run time

అందుకు తగ్గట్టుగానే దర్శకుడు ఎడిటింగ్ రూమ్ లో కూర్చున్నట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఆచార్య సినిమా రెండు గంటల 45 నిమిషాల నిడివితో విడుదల అవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుంటుందో చూడాలి. మెగాస్టార్ చిరంజీవి సరసన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది. ఇక మణిశర్మ అందించిన సంగీతం ఇప్పటికే సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X