Chiranjeevi Surgery: ఢిల్లీ ఆసుపత్రిలో చేరిన చిరంజీవి.. సర్జరీ ఎలా జరిగిందంటే?

తెలుగు చిత్రపరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి స్థానం చెరగనిది. ఎన్నో ఏళ్లుగా హవా చాటుతూ బాస్ అనిపించుకుంటున్నారు. కుర్ర హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ జోష్ చూపిస్తున్నారు. అయితే ఇంతకుముందు లూసీఫర్ రీమేక్ మూవీ గాడ్ ఫాదర్, ఒరిజినల్ స్టోరీ చిత్రం వాల్తేరు వీరయ్యతో మంచి హిట్లు కొట్టిన చిరంజీవి మరో రీమేక్ సినిమాతో ప్లాప్ మూటగట్టుకున్నారు. భోళా శంకర్ సినిమాపై నెగెటివిటీ స్పెడ్ అవుతోంది. ఇదిలా ఉంటే తాజాగా ఆయన మోకాలికి సర్జరీ చేయించుకుంటున్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం చిరంజీవి ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో ఎదిగిన నటుడు మెగాస్టార్ చిరంజీవి. కొంతకాలం రాజకీయాలతో సినిమాలకు దూరంగా ఉన్న రీ ఎంట్రీ తర్వాత వరుస పెట్టి చిత్రాలతో జోష్ చూపిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహా రెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నెక్ట్స్ బ్రో డాడీ అనే మరో రీమేక్ సినిమాలో చిరు నటించనున్నాడని టాక్.

Megastar Chiranjeevi

ఇదిలా ఉంటే చిరంజీవి మోకాలికి స్వల్ప శస్త్ర చికిత్స జరిగినట్లు సమాచారం. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చిరంజీవి చేరారు. ఈ నేపథ్యంలో ఆయనకు సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోకాలిలో తరచూగా నొప్పి రావడంతో చిరు పరీక్షలు చేయించుకోగా.. ఇన్ఫెక్షన్ ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో చిరంజీవికి ఎలాంటి కోత లేకుండా ఆర్థ్రోస్కోపిక్ విధానంలో ఢిల్లీ వైద్యులు ఇన్ఫెక్షన్ తొలగించినట్లు సమాచారం. ఇక చిరు అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలుస్తోంది.

Megastar Chiranjeevi

ఇదిలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం ఢిల్లీలోనే విశ్రాంతి తీసుకుంటున్నారని టాక్. మరో నాలుగు, ఐదు రోజుల్లో హైదరాబాద్ కు తిరిగి రానున్నట్లు చిరంజీవి పీఆర్ బృందం పేర్కొంది. కాగా చిరంజీవికి అమెరికా ట్రిప్ లో ఉన్నప్పుడు మోకాలికి స్వల్పంగా గాయం అయింది. మొదట్లో అక్కడే చేయించుకుంటారని వార్తలు వచ్చాయి. కానీ వాటికి భిన్నంగా ఆయన సర్జరీ ఢిల్లీలో జరిగింది. గతంలో కూడా ఇలాంటి సమస్యలతో చిరంజీవి బాధపడ్డారు. భుజానికి సంబంధించిన సమస్యల కారణంగా 2016లో కుడి, ఎడమ భుజాలకు చిరు ఆపరేషన్ చేయించుకున్నారు. ఇప్పుడు మోకాలి నొప్పితో మరోసారి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X