Chiranjeevi: రాజకీయం నా నుంచి దూరం కాలేదు అంటూ మెగాస్టార్ కామెంట్.. ట్వీట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రాజకీయాల నుంచి ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా పెద్దగా ఈ అంశాలపై ఫోకస్ చేసింది లేదు. అయితే అప్పుడప్పుడు రాజకీయ నేతలతో మాత్రం ఏదైనా అత్యవసర సమావేశంలో కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చిరంజీవి కొద్దిసేపటి క్రితం పోస్ట్ చేసిన ఒక ఆడియో వైరల్ గా మారుతోంది ఆయన పాలిటిక్స్ పై గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక ఆడియో షేర్ చేశారు.

పాలిటిక్స్ లో అలా..

పాలిటిక్స్ లో అలా..

ఆ వివరాల్లోకి వెళితే... ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత చిరంజీవి కొన్నాళ్ల పాటు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు. అక్కడ గెలవకపోవడంతో మళ్లీ వేరే పార్టీలో చేరి ప్రజా సేవలో పాల్గొన్నారు. అక్కడ కూడా ఆయన పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు. ఇక అభిమానుల కోరిక మేరకు మళ్లీ ఆయన వెండితెరపై గ్రాండ్ ఎంట్రీ గా రీ ఎంట్రీ ఇచ్చారు.

ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు

ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో మెగాస్టార్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు అని క్లారిటీ వచ్చేసింది. మెగాస్టార్ విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక రాజకీయాలకు ఆయన దూరంగా ఉన్నప్పటికీ మాత్రం ప్రజాసేవకు మాత్రం కొంచెం కూడా దూరం కాలేదు.

మెగా సహాయాలు

మెగా సహాయాలు

ఎప్పటిలానే సామాజిక అంశాలపై స్పందిస్తూ అలాగే మానవత్వంతో ఎన్నో సహాయాలు కూడా కొనసాగిస్తున్నారు. కరోనా కష్టకాలంలో చాలామందికి అయినా ఉచితంగా వైద్య సహాయం తో పాటు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి చిత్రపరిశ్రమలో కూడా కళాకారులకు కూడా తనవంతు సాయం చేశారు.

పాలిటిక్స్ లోకి మెగాస్టార్ అంటూ..

పాలిటిక్స్ లోకి మెగాస్టార్ అంటూ..

ఇక అప్పుడప్పుడు కొంతమంది కావాలని విమర్శలు చేస్తున్నా కూడా ఆయన తను చేసే మంచి పనులకు ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. ఈ తరుణంలో ఆయనపై మళ్లీ రాజకీయ వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ పాలిటిక్స్ లోకి రాబోతున్నారు అని కూడా ఆ మధ్యలో వరుసగా కథనాలు వెలువడ్డాయి. అయితే ఎప్పుడూ కూడా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నట్లు క్లారిటీ ఇచ్చింది లేదు.

రాజకీయం నా నుంచి దూరం కాలేదు

ఇక ఇప్పుడు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఆడియో హాట్ టాపిక్ గా మారింది. రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను.. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు అని.. మెగా స్టార్ ఆడియో లో వివరణ ఇచ్చిన విధానం చర్చనీయాంశంగా మారింది. హఠాత్తుగా మెగాస్టార్ ఈవిధంగా పాలిటిక్స్ పై కామెంట్ చేయడం కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నప్పటికీ కూడా గాడ్ ఫాదర్ సినిమాలోనే డైలాగ్ అయి ఉండవచ్చు అని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

సినిమాలతో బిజీగా

సినిమాలతో బిజీగా

గాడ్ ఫాదర్ సినిమాలో కూడా పొలిటికల్ యాక్షన్ మొవీగా తెరపైకి రానుంది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ దాసరా సినిమా సందర్భంగా అక్టోబర్ 5వ తేదీన విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా అనంతరం మెగాస్టార్ మరో మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. భోళా శంకర్ తో పాటు వాల్తేరు వీరయ్య సినిమాలు కూడా రానున్నాయి. అలాగే వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X