సుధీర్ బాబుకు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్.. 'శ్రీదేవి సోడా సెంటర్' మాస్ సాంగ్ పై పాజిటీవీ కామెంట్
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ హీరో సుధీర్ బాబు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైమ క్రేజ్ ను అందుకుంటూ వెళుతున్నాడు. రొటీన్ కమర్షియల్ మూవీస్ కాకుండా కాస్త విభిన్నమైన సినిమాలను చేస్తుండడంతో అతనికంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది. సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా యాక్టింగ్ విషయంలో మంచి మార్కులే పడుతున్నాయి. ఇక త్వరలో మరొక హిట్ కొట్టడానికి శ్రీదేవి సోడా సెంటర్ అనే సినిమాతో రెడీ అవుతున్నాడు.
కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ సినిమాలో సుధీర్ బాబు సరికొత్త ఫిట్నెస్ తో కనిపిస్తున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన మొదటి సాంగ్ ను మెగాస్టార్ చేతుల మీదుగా లాంచ్ చేయిస్తున్నారు. మందులోడా అనే సాంగ్ జూలై 9న ఉదయం 9గంటలకు విడుదల చేయబోతున్నారు. ఇక మెగాస్టార్ ఆ సాంగ్ క్యాచీగా ఉందని కామెంట్ చేశాడు. తప్పకుండా సినిమా విజయాన్ని అందుకుంటుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.

టీజర్ తోనే మంచి బజ్ క్రియేట్ చేసిన సుధీర్ బాబు ఫిట్నెస్ కూడా పూర్తిగా మార్చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను ఇటీవల జీ5 సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ సినిమాపై పెట్టిన బడ్జెట్ మొత్తం వెనక్కి వచ్చేలా 9కోట్లకు డీల్ క్లోజ్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇక సినిమా విడుదల తరువాత థియేట్రికల్ గా వచ్చే కలెక్షన్స్ బోనస్ అని చెప్పవచ్చు. చూస్తుంటే సుధీర్ బాబు మెల్లగా తన మార్కెట్ ను కూడా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











