Bhola Shankar: మరోసారి చిరు లీక్స్ మొదలు.. ఈసారి ఫ్యాన్స్ కు కిక్కిచ్చే వీడియో లీక్
మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాపై మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరపైకి వస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదళంకు రీమేక్ అని తెలిసినా విషయమే. దర్శకుడు మెహర్ రమేష్ మాత్రం మెగాస్టార్ ను వెండితెరపై నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్తగా ప్రజెంట్ చేయనున్నట్లు అర్ధమవుతోంది.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా తుది దశకు చేరుకోవడంతో చిత్ర యూనిట్ గ్యాప్ లేకుండా అప్డేట్స్ ఇస్తోంది. ఇప్పటికే విడుదలైన భోళా మ్యానియా ఫస్ట్ సాంగ్ మెగా ఫ్యాన్స్ చేత స్టెప్పులు వెయిస్తోంది. ఇక త్వరలోనే మరో పార్టీ సాంగ్ ను విడుదల చేసేందుకు మెహర్ రమేష్ యూనిట్ సిద్ధమవుతోంది. అయితే ఎప్పటిలానే మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కోసం మరోసారి చిరు లీక్స్ అంటూ కొత్తగా బజ్ క్రియేట్ చేశారు.

సినిమాలో సంగీత్ సన్నివేశంలో భాగంగా వచ్చే ఒక పార్టీ సాంగ్ ఉందట. ఇక ఆ పాటకు సంబంధించిన మేకింగ్ వీడియోను కూడా మెగాస్టార్ చిరంజీవి తన ఇన్ స్టాగ్రామ్ లో రిలీజ్ చేశారు. ఇక ముందుగానే ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కోసం ఈ తరహాలో లీక్ చేస్తున్నట్లు చెబుతూ దాన్ని చూసి ఎంజాయ్ చేయాలి అని వివరణ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో అది కాస్త వైరల్ గా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి సినిమాకు హైప్ తేవడంలో సరికొత్తగా ఆలోచిస్తున్నారు అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడిగా తమన్న నటిస్తుండగా ఆయనకు సోదరి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక ఇప్పుడు పార్టీ సాంగ్ లో దాదాపు సినిమాలోని నటీనటులు అందరూ కూడా కనిపించబోతున్నారు. ఆ పాట చాలా బ్యూటీఫుల్ గా ఉండబోతుందట. ఇక భోళా శంకర్ సినిమాను ఆగస్టు 11వ తేదీన వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











