Chiranjeevi: ‘తనే నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్’: మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Mega Star Chiranjeevi: శివ శంకర వరప్రసాద్.. ఈ పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ, చిరంజీవి అంటే మాత్రం అందరి నోటా మెగాస్టార్ అనే నినాదమే వస్తుంది. ఆయన నట ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి.. సైడ్ హీరో నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు చిరంజీవి.కేవలం నటనలోనే కాకుండా ఈయన సేవారంగంలోనూ ముందుంటారు. కామన్‌గా సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బయట ఎవరిని మీ ఫేవరెట్ హీరో అని అడిగితే ఫస్ట్ మెగాస్టార్ పేరే చెబుతారు. వందలో 90 శాతం ఈయనే పేరే వినిపిస్తుంది. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా? చిరు మదిని దొచుకున్న హీరోయిన్ ఎవరో మీరు కూడా తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవి 70 ఏళ్లు దగ్గరగా వస్తోన్న యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీసును షేక్ చేస్తున్నారు. యంగ్ లుక్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి ఏమాత్రం ఎనర్జీ తగ్గినట్లు కనిపించట్లేదు. అదే స్టేమినాతో డాన్స్ ఇరగదీస్తున్నారు. ప్రస్తుతం ఈ నటుడు విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. మెగా ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు విశ్వంభర నుంచి మేకర్స్ అప్డేట్స్ వదులుతారని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరీ విశ్వంభర హిట్ కొట్టనుందా? లేదో చూడాలి మరీ.

ఇకపోతే రీసెంట్‌గా భారీ వర్షాల కారణంగా ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలు నీట మునిగి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు కలిసి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. రీసెంట్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రూ. 50 లక్షల చెక్ అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ విషయాన్ని చిరంజీవి ట్విట్టర్ వేదికన పంచుకున్నారు. దీంతో మెగా ఫ్యాన్స్ చిరుపై పొగడ్తల వర్షం కురిపించారు.

ఇక చిరు గతంలో ఓ ఇంర్వ్యూకు హాజరై పలు ఇంట్రెస్టింగ్ విషయాలు చర్చించారు. కోట్లాది మంది ఇష్టపడే చిరంజీవికి ఓ హీరోయిన్ అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. ఆల్‌టైమ్ తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరని యాంకర్ అడగ్గా.. 'నిజానికి ఒక్కో హీరోయిన్‌లో ఒక్కో క్వాలిటీ ఉంటుందన్నారు. కానీ రాధ డాన్స్ బాగా నచ్చుతుందని తెలిపారు. శ్రీదేవి పర్సనాలిటీ పరంగా సూపర్ అని కొనియాడారు.

సుమలత హోమ్లీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అని పొగిడారు. అలాగే జయసుధ, వాణిశ్రీ, సావిత్రిలు కూడా అద్భుతంగా నటిస్తారని అన్నారు. ఇక రాధిక అయితే అన్ని రకాల పాత్రల్లో నటించగలదని వెల్లడించారు. రాధిక అంటే తనకు ఇష్టమని ఇన్ డైరెక్ట్ గా పేర్కొన్నారు చిరు. వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని, చిరు ఫేవరెట్ నటి రాధికనే అని చెప్పకనే చెప్పారు.


Click it and Unblock the Notifications











