మెగా ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్.. మళ్ళీ రిలీజ్ కాబోతున్న చిరంజీవి మాస్ మూవీ!
ఇటీవల కాలంలో అభిమానుల కారణంగా కొన్ని పాత సినిమాలకు కూడా మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. థియేటర్లో సినిమాలను చూసి ఏ విధంగా ఎంజాయ్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల మహేష్ పుట్టినరోజు సందర్భంగా పోకిరి సినిమా ప్రదర్శనలకు ఫ్యాన్స్ హంగామాలు సంతోషాలు ఒక రేంజ్ లో హైలెట్ అయ్యాయి. కంటెంట్ తో వచ్చే సినిమాలు ఎన్నిసార్లు థియేటర్లో వచ్చిన కూడా చూస్తారు అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మెగా అభిమానులు కూడా మెగాస్టార్ చిరంజీవి కల్ట్ మాస్ మూవీని మరోసారి వెండితెరపై చూసేందుకు సిద్ధం కాబోతున్నారు.
ఆగస్టు 22వ తేదీన మెగాస్టార్ పుట్టినరోజును ఈసారి మెగా అభిమానులు చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఇప్పటికే కొన్ని ఈవెంట్స్ కూడా నాగబాబు ఆధ్వర్యంలో సిద్ధమవుతున్నాయి. అయితే కొన్ని సినిమాలను కూడా ప్రత్యేకంగా వెండి తెరపై చూడడానికి అభిమానులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అప్పట్లో సంచలనం విజయాన్ని అందుకున్నటువంటి ఘరానా మొగుడు సినిమాను కూడా బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇదివరకే కొన్ని సినిమాలపై సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వచ్చాయి మెగాస్టార్ కు సంబంధించిన కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారాలు జరిగాయి. అయితే ఆగస్టు 21, 22వ తేదీలలో ప్రసాద్ ఐమాక్స్ లలో ఘరానా మొగుడు సినిమాను ప్రదర్శించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అభిమానుల కోరిక మేరకు మరికొన్ని స్క్రీన్స్ లో కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి అయితే ఐమ్యాక్స్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.
ఇక ఘరానా మొగుడు రీ రిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్ అన్నీ కూడా సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని అనుకుంటున్నారు. అలాగే త్వరలో జల్సా సినిమాను కూడా ర్ రిలీజ్ చేయడానికి ప్రస్తుతం గీతా ఆర్ట్స్ కూడా ప్రయత్నాలు చేస్తోంది. సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే 4కే క్వాలిటీ తో సినిమాను మళ్ళీ కొత్త ప్రింట్స్ తో రెడీ చేసినట్లు సమాచారం. అభిమానుల కోరిక మేరకు దాదాపు 500 షోలను ప్రదర్శించడానికి కూడా గీత ఆర్ట్స్ ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్. ఇక వచ్చిన డబ్బుతోనే వారు కూడా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నారు.


Click it and Unblock the Notifications











