దటీజ్ చిరంజీవి.. క్యానర్ బారిన అభిమాని.. ఫ్లైట్ టిక్కెట్స్ పంపి మరీ, హాస్పిటల్ కు.. వదిలేది లేదంటూ!

మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగు వారు ఉండరు.. తెలుగులో మరీ హీరోకి లేని విధంగా చిరంజీవికి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఒక రకంగా చిరంజీవి అంటే.. అభిమానులకు ప్రాణం కంటే ఎక్కువే. అందుకే మెగాస్టార్ చిరంజీవిని అభిమానులు ఎంతలా అభిమానిస్తారో, అభిమానులను కూడా చిరంజీవి అంతేలా ప్రేమిస్తారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన అభిమాని విషయంలో చేసిన ఒక పని ఇప్పుడు మెగా అభిమానులనే కాక తెలుగు ప్రేక్షకులకు కూడా మనసుకు హత్తుకునేలా చేసింది. ఎవరా చిరంజీవి అభిమాని? చిరంజీవి ఏం చేశారు? అనే వివరాల్లోకి వెళితే తే

క్యాన్సర్తో బాధపడుతుంటే

క్యాన్సర్తో బాధపడుతుంటే

మెగాస్టార్ వీరాభిమాని, విశాఖపట్నానికి చెందిన వెంకట్ కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే వెంకట్ ట్విట్టర్ ద్వారా చిరంజీవి గారిని కలవాలని వారితో మాట్లాడాలనే విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకొచ్చారు. నా ఆరోగ్యం అంతగా బాగుండడం లేదు, నేను మిమ్మల్ని కలవాలని కోరుకుంటున్నాను అని ట్విట్టర్ వేదికగా చిరంజీవిని వెంకట్ అభ్యర్థించారు. ఈ విషయం మీద చిరంజీవి వెంటనే స్పందించి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు వాకబు చేసి వెంటనే వచ్చి తనను కలవాల్సిందిగా కోరారు.

ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ

ఫ్లైట్ టికెట్స్ పంపి మరీ

అయితే తన అభిమాన హీరో నుంచి పిలుపు వచ్చింది అని ఆనందపడాలో లేక తాను వెళ్లి కలవలేని పరిస్థితుల్లో ఉన్నాను అని బాధ పడాలో తెలియక వెంకట్ మదన పడిపోయారు. వెంకట్ అనారోగ్యం కారణంగా కదిలే పరిస్థితి లేకుండా పోయిందని చిరంజీవి దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో చిరంజీవి ఎలా అయినా వెంకట్ ను కలవాలని భావించి వెంకట్, వెంకట్ భార్యకు విశాఖపట్నం నుంచి హైదరాబాదుకు ఫ్లైట్ టికెట్స్ తానే పంపి హైదరాబాద్ రప్పించారు. ఈ రోజు చిరంజీవి నివాసంలో వెంకట్ ఆయన భార్య సుజాతను నివాసంలో కలిశారు. ఇద్దరితో దాదాపు 45 నిమిషాల సమయం కూడా గడిపారు చిరంజీవి.

సమయం గడిపి

సమయం గడిపి

చిరు వీరాభిమాని వెంకట్, వెంకట్ భార్య సుజాతతో చిరంజీవి సమయం గడిపి వెంకట్ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. వెంకట్ మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన చిరంజీవి సెకండ్ ఓపెనింగ్ తీసుకుని మెరుగైన వైద్యం అందించడం కోసం హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్స్ లో చేర్పించారు.

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

వదిలిపెట్టే ప్రసక్తే లేదు

అక్కడ అన్ని రకాల పరీక్షలు చేయించిన చిరంజీవి అక్కడి వైద్యులను సంప్రదించి, ఎంత ఖర్చయినా పర్వాలేదు అని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. అవసరమైతే చెన్నైలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి తరలించి అక్కడ వైద్యం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని తన వీరాభిమాని వెంకట్ ను కాపాడుకోవడానికి వెనుకాడేది లేదని చిరంజీవి వెంకట్, ఆయన భార్య సుజాతకు భరోసా ఇచ్చారు.

మెగా అభిమానుల ఆనందం

మెగా అభిమానుల ఆనందం

ఇక ఈ విషయం చేసుకున్న మెగాస్టార్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ మంచి మనసు తమకు తెలుసని, అది మరోసారి ప్రూవ్ అయింది అని మెగా అభిమానులు చెబుతున్నారు. మెగాస్టార్ నిర్ణయం తమకు చాలా ఆనందం కలిగిస్తోందని, ఆయన అభిమానులుగా ఉన్నందుకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తోటి అభిమాని అయిన వెంకట్ అనారోగ్యం నుంచి కోలుకుని తిరిగి మామూలు మనిషి అవ్వాలని మెగా అభిమానులు అభిలషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X