Megastar Chiranjeevi: మెగాస్టార్ మెగా ప్లాన్, మామూలుగా లేదుగా - ఆరు నెలలు షూటింగ్, ఆరు నెలలు సీజీ వర్క్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తుందంటే చాలు.. ఆయన ఫ్యాన్స్ అంతా పూనకాలతో ఊగిపోతుంటారు. ముఖ్యంగా చిరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి విపరీతంగా ఎగ్జైట్ అవుతున్నారు. ఆయన ఏ సినిమా చేస్తానని ప్రకటించినా.. అప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకూ అప్ డేట్ల గురించి తెలుసుకునేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ముఖ్యంగా మెగాస్టార్ సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్దకు వెళ్లి క్యూ కడుతున్నారు. అభిమానుల జోరు చూసిన చిరంజీవి కూడా అందుకు తగ్గట్లుగానే ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా సంవత్సరానికి కనీసం రెండు చిత్రాల్లో అయినా నటించేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

Chiranjeevi Bhola Shankar

ఇటీవల వచ్చిన భోళా శంకర్ సినిమా థియేటర్ల వద్ద ఫ్లాప్ గా నిలవగా.. కాస్త నిరాశకు గురయ్యారు. కానీ త్వరగానే దాని నుంచి బయట పడి మరో సినిమా చేసేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. బింబిసార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుకొట్టి డైరెక్టర్ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న వశిష్ఠ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే యువీ క్రియేషన్స్ పతాకంపై వి వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు ఈ సినిమాను నిర్మించబోతుండగా.. పనులు అన్నీ చకచకా పూర్తి అవుతున్నట్లు సమాచారం.

నవంబర్ నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఆరు నెలల పాటు సినిమా చిత్రీకరణ, ఆ తర్వాత ఆరు నెలలు సీజీ వర్క్ చేయాలని ప్లాన్ చేసుకున్నారట. అంటే నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు షూటింగ్.. ఆ తర్వాత ఈరు నెలలు మొత్తం సీజీ వర్క్ పూర్తి చేసుకుంటారట. మెగాస్టార్ చిరంజీవికి ఇది 157వ చిత్రం కావడంతో.. ఈ సినిమాకు "మెగా 157" అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉంటారని సమాచారం. అందుకోసం అనుష్క శెట్టి, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చూడాలి మరి ఎవరెవరు ఈ సినిమాలో నటించబోతున్నారో.

Megastar Chiranjeevi Mega planning For His Next Moive Mega 157

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాను ప్రటకించారు. అలాగే నిప్పు, భూమి, గాలి, నీరు, అకాశం తదితర అంశాలను జోడించి త్రిశూలంతో నక్షత్రాకారంలో రూపొందించిన ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా సోషియో ఫాంటనీ నేఫథ్యంలో సాగే సినిమా అని తెలుస్తుండగా.. దీనిపై భారీ ఎత్తున అంచనాలు క్రియేట్ అయ్యాయి.

గతంలో అంటే 1990లో చిరంజీవి, శ్రీదేవి జంటగా చేసిన జగదీక వీరుడు అతిలోక సుందరి సినిమా కూడా ఫాంటసీ కథాంశంలో తెరకెక్కగా.. బ్లాక్ బస్టర్ హిట్టు అయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా అంతకు మించిన హిట్టు అయ్యే ఛాన్స్ ఉందని అంతా భావిస్తున్నారు. మరి చూడాలి చిరు 157వ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో, ఎంతమేర కలెక్షన్లను వసూలు చేస్తుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X