Wayanad Floods: కేరళ బాధితుల కోసం స్వయంగా చిరంజీవి.. నేరుగా సీఎంను కలిసి.. !

కేరళలోని వాయనాడ్ ప్రాంతం వరద తాకిడికి అతలాకులతమైంది. వందలాది మంది మరణించాచ.. పలు ప్రాంతాలు జలమయ్యాయి. వేలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఆ ప్రాంతంలో జనజీవనం స్తంభించింది. బాధితుల ఆక్రందనలతో ఆ ప్రాంతమంతా విషాదమయంగా మారింది. అన్నమో రామచంద్ర అనడమే కాకుండా సహయం కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు.

అయితే పొరుగు రాష్ట్రంలో పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఎప్పటిలానే తెలుగు సినిమా పరిశ్రమల వెంటనే స్పందించింది. చిరంజీవి, రామ్ చరణ్ ఆర్థికంగా సహయం అందించేందుకు ముందుకు వచ్చారు. అయితే బాధితులకు అండగా ఉండటానికి చిరంజీవి కేరళలోకు వెళ్లి ఓదార్పు ఇచ్చేందుకు ప్రయత్నించారు. చిరంజీవి కేరళ పర్యటన వివరాల్లోకి వెళితే..

Megastar Chiranjeevi met Kerala CM to handover 1 crore cheque to Wayanad victims

కేరళలోని వయనాడ్ ప్రాంతాన్ని వరద భీభత్సం సృష్టించడంతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది.దాంతో చిరంజీవి, రాంచరణ్ ఏకంగా 1 కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆర్థికంగానే కాకుండా తాము మనోస్థైర్యం నింపడానికి ముందుంటామని మెగా ఫ్యామిలీ స్పందించింది. ప్రకటించిన విరాళం మొక్కుబడిగా అందించకుండా నేరుగా ఇచ్చేందుకు వెళ్లడం ప్రశంసలు కురిపిస్తున్నారు.

వయనాడ్ బాధితులకు కోసం ప్రకటించిన సహాయాన్నిఅందించేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విమానంలో త్రివేండ్రం చేరుకొన్నారు.ఆయనకు అక్కడ అధికారులు స్వాగతం పలికారు. కేరళ సీఎంను కలిసి కోటి రూపాయల చెక్‌ను అందించారు. ఆర్థికంగానే కాకుండా ఇతర చర్యల ద్వారా సహాయం అందించేందుకు రెడీగా ఉన్నామనే సంకేతాలు అందించారు. కాగా, చిరంజీవి కేరళకు వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ఇదిలా ఉండగా, చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు.ఇటీవల క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఇంకా షూటింగులో బిజీ ఉన్నప్పటికీ.. కొంత సమయం తీసుకొని కేరళ బాధితులకు సహయం అందించేందుకు వెళ్లారు.

More from Filmibeat

Read more about: chiranjeevi wayanad kerala
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X