Happy Mothers Day: తల్లితో మెగాస్టార్ చిరంజీవి హ్యాపీ సెలబ్రేషన్స్.. స్పెషల్ ఫొటోస్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలతో మెప్పించడమే కాకుండా అందరికి స్ఫూర్తినిచ్చే విధంగా చాలా మంచి సినిమాలు కూడా చేశారు. అయితే మెగాస్టార్ చిరంజీవి వెండి తెరపై ఎంతో ఉన్నతంగా కనిపించినప్పటికి పర్సనల్ లైఫ్ లో కూడా చాలా సింపుల్ గానే ఉండేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక ఆయన కుటుంబానికి ఇచ్చే గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులను సోదరీమణులను గౌరవిచ్చేలా ఆయన ప్రతీ పండగను సెలబ్రేట్ చేసుకుంటారు.
చిన్నపిల్లల నుంచి పెద్దవారి దాక అందరూ కూడా మెగాస్టార్ చిరంజీవిని ఎంతగానో అభిమానిస్తూ ఉంటారు. ఇక మెగాస్టార్ గా చిరంజీవి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినప్పటికీ కూడా ఆయన తన తల్లి దగ్గర మాత్రం ఎంతో విధేయతతో ఉంటారు. నేడు మదర్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా తన తల్లిని గుర్తు చేసుకుంటూ కొన్ని ప్రత్యేకమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

అనురాగం, మమకారం... ఈ రెండిటికి అర్ధమే అమ్మ ... అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి.. హ్యాపీ మదర్స్ డే.. అంటూ మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక ఆయన సోదరీమణులు కూడా మెగాస్టార్ తల్లితో ఎంతో ఆప్యాయంగా కనిపించారు.
వీరి ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా మెగాస్టార్ షేర్ చేసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమా ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అలాగే మెగాస్టార్ మరో రెండు సినిమాలను వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా భీష్మ దర్శకుడు వశిష్టతో త్వరలోనే ఒక ప్రాజెక్ట్ మొదలయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక బంగార్రాజు దర్శకుడు కళ్యాణ్ కృష్ణతో కూడా ఒక మాస్ కమర్షియల్ సినిమా చేసేందుకు మెగాస్టార్ చర్చలు జరుపుతున్నారు.


Click it and Unblock the Notifications











