Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్‌పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మరోసారి అమ్మకు వంట రుచి చూపించిన మెగాస్టార్.. చివరి వరకు టెన్షన్ పడుతూ..
మెగాస్టార్ చిరంజీవి వంట చేయడంలో సీనియర్ మాస్టర్ అని అందరికి తెలిసిందే. మెగాస్టార్ దోశ నుంచి స్పెషల్ మిర్చి వరకు వంటకాల్లో స్పెషల్ ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి అప్పుడప్పుడు తన తల్లికి స్పెషల్ గా వంట చేసి తినిపిస్తుంటారు. ఇక ఆదివారం రోజు కూడా మెగాస్టార్ తన చిన్ననాటి వంటకాన్ని గుర్తు చేసుకొని అమ్మకు ప్రేమగా వడ్డించారు. అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.
Recommended Video
తల్లి కోసం ప్రేమగా..మెగా వంటకం
మెగాస్టార్ ఏం చేసినా కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. వెండితెరపై ఎంతటి మెగాస్టార్ అయినా కూడా తన తల్లి ముందు మాత్రం ఆయన ఒక సేవకుడిగా చంటి పిల్లడిలా ఉంటారు. ఇక రీసెంట్ గా మెగాస్టార్ అమ్మ కోసం అమ్మ నేర్పిన వంట అంటూ స్పెషల్ గా చింతకాయల తొక్కుతో చేపల వేపుడు చేశారు.
చిన్ననాటి చేపల వేపుడు
చిన్నప్పడు మా అమ్మ స్పెషల్ గా చింతకాయల తొక్కుతో చేపల ఫ్రై చేసేది అంటూ అందుకే ఇప్పుడు తనకోసం నేను చేస్తున్నాను అని మెగాస్టార్ చెప్పారు. అలాగే ఒక అనుభవం ఉన్న చెఫ్ మాదిరిగా ఏది ఎంత వేసుకోవాలి అని ప్రతి ఒక్క విషయాన్ని వివరంగా చెప్పారు. ఆదివారం అమ్మ కోసం ఈ స్పెషల్ సీ ఫుడ్ ని తినిపించాలని అనుకున్నాను అంటూ చివరకు టెన్షన్ పడుతూ అమ్మ ఏమంటుందో అని తనే వడ్డించారు.
నా గుండె వేగంగా కొట్టుకుంటోంది
తల్లి అంజనా దేవి తింటుండగా బావుంది అంటుందో ఏమంటుందో అని మెగాస్టార్ కాస్త సరదాగా కామెంట్ చేశారు. అలాగే హిట్టా ఫట్టా అంటూ తన గుండె వేగంగా కొట్టుకుంటోందని టెన్షన్ గా ఉందని నవ్వుతూ అన్నారు. కొడుకు వండిన స్పెషల్ చేపల ఫ్రైని తిని బావుంది అనగానే మెగాస్టార్ ఒక్కసారిగా సంబరపడ్డారు.
మెగాస్టార్ వీడియో వైరల్
అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగాస్టార్ చాలా సింపుల్ గా ప్రేమ ఆప్యాయతలతో ఉంటారని ఆ వీడియో చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆచార్య సినిమాతో సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అలాగే బాబీ దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేయనున్నారు.