సరికొత్త లుక్‌తో షాకిచ్చిన మెగాస్టార్ చిరంజీవి: కుర్ర హీరోలు సైతం కుళ్లుకోవడం ఖాయం!

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ ఆరంభంలోనే ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న ఆయన.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయారు. అలా చాలా కాలం పాటు టాలీవుడ్‌లో తన హవాను చూపించారు. ఇక, కొన్నేళ్ల క్రితం రాజకీయాల కోసం సినిమాలకు బ్రేకిచ్చారు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం 'ఖైదీ నెంబర్ 150'తో రీఎంట్రీ ఇచ్చారు.

సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి దూకుడు ప్రదర్శిస్తున్నారు. వరుసగా సినిమాలు ఒప్పుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమా చేస్తున్నారు. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. దీని తర్వాత 'లూసీఫర్', 'వేదాళం' చిత్రాల రీమేక్‌లలో నటించనున్నారు. వీటితో పాటు మరిన్ని సినిమాలను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారాయన.

Megastar Chiranjeevi New Look for Samanthas Sam Jam Show

ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి... అక్కినేని సమంత హోస్ట్ చేస్తున్న 'సామ్ జామ్' అనే చిట్ చాట్ షోకు ముఖ్య అతిథిగా వెళ్లారు. దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే క్రమంలో ఆయన సరికొత్త లుక్‌తో దర్శనమిచ్చారు. గతంలో ఎన్నడూ చూడని హెయిర్ స్టైల్‌తో పాటు స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.

Megastar Chiranjeevi New Look for Samanthas Sam Jam Show
Megastar Chiranjeevi New Look for Samanthas Sam Jam Show

ఇదిలా ఉండగా, ఇటీవల చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే, తనకు ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో రెండు రోజుల తర్వాత మరోసారి పరీక్షలు చేయించుకున్నారాయన. రెండో సారి చేసిన టెస్టులో ఆయనకు నెగటివ్ వచ్చింది. ఆ సమయంలో కరోనా టెస్టులపై చిరంజీవి అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X