Chiranjeevi: ప్రభాస్ దర్శకుడితో చిరంజీవి నెక్ట్స్ సినిమా... టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!
మెగాస్టార్ చిరంజీవి గత ఏడాది వాల్తేరువీరయ్య, భోళా శంకర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ రెండింటిలో వాల్తేరు వీరయ్య సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఇక భోళాశంకర్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక తన తదుపరి సినిమాలపై ఫోకస్ చేశాడు. ప్రస్తుతం వశిష్టతో విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నెక్ట్స్ సినిమా అప్డేట్ వచ్చింది. ప్రభాస్ దర్శకుడితో మెగాస్టార్ సినిమా అంటే.. ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి... మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇక ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాక సినిమాలు ఆచితూచి చేస్తున్నారు. గత ఏడాది భోళా శంకర్ రిజల్ట్ తో ఆయన రూటు మార్చినట్లు తెలుస్తోంది. భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. మోహర్ రమేష్ కు అవకాశం ఇచ్చినా కూడా సరిగ్గా ఉపయోగించుకోలేదంటూ.. ఫ్యాన్స్ మండిపడ్డారు. ఇక ఈ సిినిమా ఎఫెక్ట్ తో మెగాస్టార్ తన తదుపరి సినిమాలతో ఫోకస్ పెట్టాడు.

బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా 156గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. విశ్వంభరగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా సోషియో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు ముగ్గురు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇక అధికారికంగా ఎవరు అనేది చెప్పలేదు కానీ... పలువురి పేర్లు బయటకు వస్తున్నాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. చిరంజీవి నెక్ట్స్ మూవీ అప్డేట్ బయటకు వచ్చింది. చిరంజీవి.. తన తదుపరి సినిమాను ప్రభాస్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఇటీవల మారుతి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకువచ్చాడు. ఈ విషయం తెలుసుకన్న మెగా ఫ్యాన్స్ .. ఆందోళన చెందుతున్నారు. వద్దు బాబోయ్.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మా చిరును వదిలేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మారుతి ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా టైటిల్ రాజా సాబ్. ఇటీవల సంక్రాంతి కానుకగా రాజా సాబ్ పోస్టర్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా షూటింగ్ కూడా 40 పర్సెంట్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి రానుందని తెలిపారు. ఈ సినిమా గురించి ప్రతి నెలలో ఓ అప్డేట్ ఉంటుందని చెప్పుకువచ్చాడు మారుతి.
ఇక ఆ విషయం పక్కన పెడితే.. మారుతితో మాత్రం సినిమా వద్దని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. ఆ సినిమా ఎలా ఉంటుందో అంటూ.. ఎంత డిలే చేస్తారో అని కామెంట్స్ పెడుతున్నారు. మెహర్ రమేష్ కు అవకాశం ఇచ్చి.. తప్పు చేసిన చిరంజీవి.. ఇప్పుడు మారుతికి ఎందుకు అవకాశం ఇస్తున్నారు అంటూ కామెంట్ పెడుతున్నారు. మరి చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా అనేది.


Click it and Unblock the Notifications











