మెగాస్టార్ ప్లాన్ మామూలుగా లేదు.. 65ఏళ్ళ వయసులో పవర్ఫుల్ రిస్క్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎలాంటి సినిమాలు చేసినా కూడా కమర్షియల్ హంగులతో పాటు ఎదో ఒక సందేశం ఉండేలా చూసుకుంటున్నారు. ఇక తీరిక లేకుండా కొత్త కథలపై ఫోకస్ పెడుతున్న మెగాస్టార్ కొన్ని రీమేక్ కథలపై కూడా దృష్టి పేడుతున్నారు. ఇక 65 ఏళ్ళ వయసులో ఆయన తీరిక లేకుండా గడపడానికి సిద్ధమయ్యారు. వచ్చే ఏడాది చిరంజీవి పూర్తిగా షూటింగ్స్ తోనే బిజీ కానున్నారు.

న్యాచురల్ ఫిట్నెస్ తోనే ఉండాలని..

న్యాచురల్ ఫిట్నెస్ తోనే ఉండాలని..

తగిన వ్యాయామాలతో ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు చిరంజీవి. మరీ ఎక్కువగా జిమ్ చేయకుండా న్యాచురల్ ఫిట్నెస్ తోనే ఉండాలని అనుకుంటారు. యోగా వ్యాయామం వంటి వాటితోనే రోజును ప్రారంభిస్తారు. అందుకే ఆయన ఇంతవరకు ఆరోగ్య విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. ఇక ఏడు పదుల వయసులోకి రాకముందే వీలైనన్ని యాక్షన్ సినిమాలను చేయాలని అనుకుంటున్నారట.

మళ్ళీ సైరా తరహాలో రిస్క్..

మళ్ళీ సైరా తరహాలో రిస్క్..

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సైరా సినిమాలో యాక్షన్ సీన్స్ లలో మెగాస్టార్ చాలా వరకు డూప్ లేకుండా నటించాడు. ఆ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికి మెగాస్టార్ కష్టానికి మాత్రం భారీ స్థాయిలో క్రేజ్ అందింది. ఇక ఆచార్య సినిమాలో కూడా మెగాస్టార్ అదే తరహాలో సొంతంగానే యాక్షన్ సీక్వెన్స్ లో రిస్క్ స్టంట్స్ చేయబోతున్నారట.

మరో రెండు సినిమాలు ఒకేసారి..

మరో రెండు సినిమాలు ఒకేసారి..

త్వరలోనే ఆచార్య టీమ్ మరో కొత్త షెడ్యూల్ ని స్టార్ట్ చేయనుంది. అయితే ఆ సినిమా అయిపోగానే మెగాస్టార్ మరో రెండు ప్రాజెక్టులను ఒకేసారి సెట్స్ పైకి తెనున్నాడు. ముందుగా వివి. వినాయక్ తో లూసిఫర్ రీమేక్ ని స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. అంతే కాకుండా మెహర్ రమేష్ తో తమిళ్ వేదళం కథను తెలుగులో చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ ని 9 నెలల్లో పూర్తి చేయాలని అనుకుంటున్నారట.

చాలెంజ్ విసురుతున్న మెగాస్టార్

చాలెంజ్ విసురుతున్న మెగాస్టార్

ఫుల్ స్క్రిప్ట్ తో పక్కా ప్లానింగ్ షెడ్యూల్ తో షూటింగ్స్ చేయాలని ఇదివరకే దర్శకులకు ఒక క్లారిటీ ఇచ్చారట మెగాస్టార్. ఆ రెండు షూటింగ్స్ అయిపోతే మళ్ళీ బాబీ దర్శకత్వంలోనే మరో సినిమాను సెట్స్ పైకి తేవాలని చూస్తున్నారు. ఈ విధంగా మెగాస్టార్ ఆరు పదుల వయసులో తీరిక లేకుండా పవర్ఫుల్ గా కష్టపడుతున్నారు. ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేస్తున్న మెగాస్టార్ నిజంగా నేటితరం యువ హీరోలకు ఒక చాలెంజ్ విసురుతున్నారనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X