twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా బయోపిక్ తీస్తే రాంచరణ్ నటించొద్దు.. ఎందుకంటే అని చిరంజీవి షాకింగ్ కామెంట్స్

    |

    Recommended Video

    Chiranjeevi Opinion On His Biopic | Syeraa | Ram Charan | Allu Arjun | Varun Tej

    సైరా చిత్రంతో మెగాస్టార్ చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు వసూళ్లను సాధించడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సైరా రిలీజ్‌కు ముందు జరుగుతున్న ప్రమోషన్‌లో చిరంజీవి బయోపిక్ గురించి హాట్ హాట్‌గా చర్చ జరిగింది. సైరా ప్రమోషన్ కోసం డైలీహంట్, తెలుగు వన్‌ఇండియా, తెలుగు ఫిల్మీబీట్‌కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన బయోపిక్ గురించి ప్రశ్నించగా చిరంజీవి ఆసక్తికరమైన సమాధానాలు ఇచ్చారు. ఆ సమాధానాలు మీకోసం..

    ఇక నా వల్ల కాదు.. ఆ పని రామ్ చరణ్ చేయాల్సిందే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్ఇక నా వల్ల కాదు.. ఆ పని రామ్ చరణ్ చేయాల్సిందే.. చిరంజీవి సెన్సేషనల్ కామెంట్స్

    నా జీవితం ఆధారంగా బయోపిక్

    నా జీవితం ఆధారంగా బయోపిక్

    నా జీవితం ఆధారంగా బయోపిక్ నిర్మిస్తే, నా పాత్రను రాంచరణ్ పోషించడానికి ఒప్పుకోను. నా ఫ్యామిలీలోని హీరోలు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నటించే బాగుంటుందని అనుకొంటున్నాను. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించినా బాగుంటుంది అని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు.

    రాంచరణ్ నటించొద్దు

    రాంచరణ్ నటించొద్దు

    నా బయోపిక్‌లో రాంచరణ్ ఎందుకు నటించకూడదంటే.. నా పాత్రను చెర్రీ పోషిస్తే, రాంచరణ్ జన్మించే సీన్‌లో రాంచరణ్ పట్టుకొంటే ప్రేక్షకులు నచ్చకపోవచ్చు. అదీ స్క్రీన్ మీద చూడటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే రాంచరణ్ చేయకూడదని అనుకొంటున్నాను. నా పాత్రను రాంచరణ్ పోషిస్తే దానికి నూటికి నూరు శాతం న్యాయం చేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కేవలం కొన్ని చిన్న సమస్యలు ఉన్నందున వద్దని నేను అనుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

     నా ఫ్యామిలీ హీరోలు ఎవరైనా సరే

    నా ఫ్యామిలీ హీరోలు ఎవరైనా సరే

    నా ఫ్యామిలీకి చెందిన హీరోలే ఎందుకు నా పాత్రను చేయాలని అనుకొంటున్నానంటే.. నేను యంగ్‌గా ఉన్నప్పుడు ఎలా ఉంటానో.. సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ అలానే కనిపిస్తారు. సాయిధరమ్, వరుణ్ నాలానే కనిపిస్తారని ఫ్యాన్స్, ఇంకా సన్నిహితులు చెబుతుంటారు. అంతేకాకుండా పాత్ర పరంగా వాళ్లు చాలా యాప్ట్‌గా ఉంటారు. అందుకే నా ఫ్యామిలీ హీరోలే నటించాలని అనుకొంటున్నాను అని చిరంజీవి అన్నారు.

    నా బయోపిక్ ఇంట్రస్టింగ్‌గా

    నా బయోపిక్ ఇంట్రస్టింగ్‌గా

    నా జీవితంపై బయోపిక్‌ తీస్తే అంత ఇంట్రస్టింగ్‌గా ఉంటుందా? అంటూ.. ఏమో చెప్పలేం.. నా కెరీర్‌లో, జీవితంలో ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. ఇక రాజకీయ జీవితంలో నేను చెప్పని విషయాలు చాలానే ఉన్నాయి. వాటిని బయటకు చెప్పడానికి బయోపిక్ అవకాశం కలిగించవచ్చు అని చిరంజీవి అభిప్రాయపడ్డారు.

    బాహుబలి స్ఫూర్తితోనే

    బాహుబలి స్ఫూర్తితోనే

    మాపై బాహుబలి సినిమా ఒత్తిడి అసలే లేదు. సైరా సినిమా తీయడానికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా బాహుబలి సాధించిన విజయమే. మాకు ఆ సినిమా కాన్ఫిడెన్స్ పెంచింది. ఆ స్ఫూర్తితోనే సైరాను జాతీయ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అందుకు రాజమౌళికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నర్సింహరెడ్డి జీవితం ప్రజలందరికీ తెలియాలి. అతను ఝాన్సీ లక్ష్మీభాయ్, భగత్ సింగ్, మంగళ్ పాడే కంటే ముందు స్వాత్రంత్ర్యం అని చిరంజీవి అన్నారు.

    English summary
    Megastar Chiranjeevi reacted on his Biopic in Sye Raa promotion with Telugu oneindia, Telugu Filmibeat, Daily Hunt app. He said that Ram charan should not play my Character Though he justifies my role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X