అంతరిక్షం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిరు, పవన్!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం అంతరిక్షం. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అంతరిక్షం టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అభిమానులంతా ట్రైలర్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు. ఇదిలా ఉండగా అంతరిక్షం చిత్ర యూనిట్ భారీ ప్రమోషన్ కార్యక్రమాలకు సిద్ధం అవుతోంది.
డిసెంబర్ 9న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. మెగా అభిమానులు పండగ చేసుకునే ప్రచారం ఒకటి జరుగుతోంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే ఇంతకు మించిన కన్నుల పండుగ ఫ్యాన్స్ కు ఉండదు.

అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షుకులకు సరికొత్త అనుభూతిని కలిగించనుంది. అతిధి రావు హైదరి, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్ అంతరిక్షంలో చేసే విన్యాసాలు చూడాలంటే డిసెంబర్ 21 వరకు ఆగాల్సిందే. ఆ రోజునే ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











