twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నారప్పలో నాకు వెంకటేష్ కనిపించలేదు: మెగాస్టార్ చిరంజీవి

    |

    తమిళ్ హిట్ మూవీ అసురన్ తెలుగు రీమేక్ నారప్ప ఇటీవల ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. తమిళ్ ధనుష్ నటించిన ఆ క్యారెక్టర్ కు వెంకటేష్ తనదైన శైలిలో న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో నటీనటులు నటనకు అద్భుతమైన ప్రశంసలు దక్కుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాను తెలుగులో డైరెక్ట్ చేసిన విధానం ఓ వర్గం వారికి బాగానే నచ్చింది.

    ఇక సినిమాను చూసిన సెలబ్రేటీలు చిత్ర యూనిట్ కు ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ మాట్లాడుతూ.. అందరికి కంగ్రాట్స్.. నేను ఇప్పుడే నారప్ప సినిమా చూశాను. వాటే పర్ఫామెన్స్. ఎంతో కొత్తగా ఉంది. ఎక్కడా కూడా నాకు వెంకటేష్ కనిపించలేదు. నారప్ప మాత్రమే కనిపించాడు. చాలా కొత్తగా ఉంది. పాత్రను అర్థం చేసుకొని ఎంతో లోతుగా వెళ్లి నటించావు వెంకీ. నీలో ఉండే నటుడు ఎప్పుడు ఒక తపనతో ఉంటాడు. అందుకు ఇదొక మంచి ఉదాహరణ.

     Megastar chiranjeevi positieve comments on narappa

    నీకు ఈ సినిమా మంచి సంతృప్తిని ఇచ్చిన సినిమా. టీమ్ వర్క్ కూడా అద్భుతం. మీకు మంచి పేరుతో పాటు కెరీర్ లో గర్వంగా చెప్పుకునే బెస్ట్ సినిమా అవుతుంది.. మరొకసారి అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను.. అని మెగాస్టార్ చిరంజీవి వివరణ ఇచ్చారు. ఇక మెగాస్టార్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కు వెంకటేష్ కూడా స్పంధించాడు. మీరు చెప్పిన ప్రతి మాట ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మీ ఫీడ్ బ్యాక్ కు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్యూ చిరంజీవి.. అని వెంకటేష్ వివరణ ఇచ్చారు.

    English summary
    Sreekanth addala big hopes on narappa and his upcoming projects, Narappa is an upcoming Indian Telugu-language action drama film directed by Srikanth Addala. A remake of the Tamil-language film Asuran (2019) which is itself based on the novel Vekkai by Poomani, Narappa movie amazon prime release date fix.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X