twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ కిరాతకుడు చనిపోవడంపై మెగాస్టార్ రియాక్షన్.. ఆ తప్పులు జరగకుండా ఉండేందుకు చొరవ.. రెడీ అంటూ

    |

    మెగాస్టార్ చిరంజీవి కేవలం వెండితెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా ఎంతో బాధ్యతగా ఆలోచిస్తూ ఉంటారు. ఎవరు ఏ మంచి పని చేసినా కూడా ఆయన ముందుండి తన సహకారం అందించడానికి ప్రయత్నం చేస్తారు. కరోనా కష్టకాలంలో ఆయన కేవలం ఇండస్ట్రీ కళాకారులకు మాత్రమే కాకుండా బయట ఎంతో మంది సాధారణ జనాలకు కూడా సహాయం చేశారు.

    అయితే ఇటీవల జరిగిన సైదాబాద్ సింగరేణి కాలనీ అత్యాచార ఘటనపై మెగాస్టార్ చాలా ఎమోషనల్ గా స్పందించారు. అనంతరం నిందితుడు చనిపోవడం పై కూడా తనదైన శైలిలో వివరణ ఇచ్చి ఇలాంటి తప్పులు జరగకుండా ఉండాలని, ఒక మంచి కార్యక్రమం చేపట్టేందుకు తన వంతు సహాయం చేస్తానని కూడా వివరణ ఇచ్చారు.

    మంచు మనోజ్, పవన్ కళ్యాణ్..

    మంచు మనోజ్, పవన్ కళ్యాణ్..

    సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం అందరిని కలిసి వేసిన విషయం తెలిసిందే. అయితే అత్యాచార ఘటన జరిగిన రోజు నుంచి కూడా నిందితుడు రాజు తప్పించుకుని తిరుగుతున్నాడు. ఎలాగైనా అతన్ని పట్టుకుని శిక్షించాలని చాలా మంది ప్రముఖుల కూడా స్పందించారు. మంచు మనోజ్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలు కూడా బాధిత కుటుంబాన్ని పరామర్శించి తప్పకుండా న్యాయం జరిగేలా చేస్తామని భరోసా ఇచ్చారు.

    బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని

    బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని

    ఇదివరకే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా జరిగిన ఘటనపై ఎమోషనల్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా మన కుతుళ్ళను కాపాడుకోవాలని అంటూ తప్పు చేసిన నిందితులను ఏమాత్రం వదిలిపెట్టకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు.

    నిందితుడి ఆత్మహత్య

    నిందితుడి ఆత్మహత్య

    అత్యాచారం జరిగిన తర్వాత నిందితుడు రాజు కొన్ని రోజులుగా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఇక నేడు అతను స్టేషన్ ఘన్పూర్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వివరణ ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది ఈ ఘటనపై స్పందిస్తున్నారు. మెగాస్టార్ కూడా హత్యాచార ఘటనలు జరగకుండా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు.

    మార్పు కోసం మెగాస్టార్ మద్దతు

    మార్పు కోసం మెగాస్టార్ మద్దతు

    మెగాస్టార్ ఈ విధంగా వివరణ ఇచ్చారు.. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడా రాజు తనకు తానే శిక్షించడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత వూరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం కూడా చొరవ చూపాలి. అందుకు ఏటువంటి కార్యక్రమం చేపట్టిన వారికి నా సహకారం ఉంటుంది. కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి.. అని మెగాస్టార్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

    Recommended Video

    Prakash Raj Speech About MaaMembers | CineMAABidalu | MaaElections
    ఫుల్ సపోర్ట్ ఉంటుందని..

    ఫుల్ సపోర్ట్ ఉంటుందని..

    మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఏదైనా మంచి కార్యక్రమాలు చేపట్టాలని తోటి మహిళలకు గౌరవం ఇచ్చే విధంగా రేపటి భవిష్యత్తు తరాలను సంసిద్ధం చేయాలని చాలామంది సినీ ప్రముఖులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా కూడా తను మద్దతు ఇస్తానని వివరణ ఇచ్చారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలామంది మెగాస్టార్ చేసిన ట్వీట్ కు మద్దతు పలుకుతున్నారు.

    English summary
    Megastar chiranjeevi reaction on saidabad girl incident
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X