టాప్ విలన్ కోసం మెగాస్టార్ చిరంజీవి.. ఏకంగా 10 భాషల్లో ఆ బిగ్ బడ్జెట్ మూవీ ప్లాన్
మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత మళ్లీ వరుస సినిమాలను లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఖైదీ నెంబర్ 150 సినిమా తో మంచి రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ ఆ తర్వాత సై రా సినిమాతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ను టచ్ చేసి మంచి గుర్తింపు అందుకున్నారు. చాలా గ్యాప్ లో వచ్చినప్పటికీ కూడా మెగాస్టార్ స్టార్ హోదా అయితే మార్కెట్ లో ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పాలి. ఇక రాబోయే సినిమాల పై కూడా అభిమానుల్లో అంచనాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. మెగాస్టార్ స్టార్ హోదా గురించి తెలిసిన చాలా మంది సినీ ప్రముఖులు సినిమాలకు ప్రత్యేకంగా ప్రమోషన్స్ కోసం సహాయం కోరుతూ ఉండటం విశేషం.
ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా వీలైనంతవరకు తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రేమోషన్స్ లో సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి చాలా సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇతర భాషల నుంచి వస్తున్న సినిమాలకు కూడా అప్పుడప్పుడు మెగాస్టార్ ప్రమోషన్స్ చేస్తూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈగ విలన్ సుదీప్ కిచ్చా నటించిన ఒక సినిమా ప్రమోషన్ విషయంలో మెగాస్టార్ చిరంజీవి తన వంతు సహాయాన్ని చేయబోతున్నారు. సుదీప్ నటించిన విక్రాంత్ రోణ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఆ సినిమాకు సంబంధించిన తెలుగు టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా విడుదల చేయబోతున్నారు.

ఏప్రిల్ 2వ తేదీన విక్రాంత్ రోణ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఉదయం 9 గంటల 55 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఇక తమిళం లో మరొక హీరో శింబు తమిళ భాషకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయబోతున్నారు. మలయాళంలో మోహన్ లాల్ ఈ టీజర్ ను విడుదల చేయబోతున్నాడు. మొత్తంగా పది భాషల్లో విడుదల అవుతున్న ఈ సినిమా ఇంగ్లీష్ లో కూడా విడుదల కాబోతోంది. ఇక ఇంగ్లీషులో సుదీప్ సొంతంగా డబ్బింగ్ చెప్పాడు.
ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. అనూప్ బందారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను షాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మిస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సౌత్ ఇండస్ట్రీ లోనే కాకుండా నార్త్ లో కూడా మంచి విజయాన్ని అందుకోవాలని భారీ స్థాయిలో ప్రమోషన్ కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదివరకే తెలుగులో రక్తచరిత్ర, ఈగ సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న సుదీప్ ఇప్పుడు విక్రాంత్ రోణతో మరింత హై లెవెల్లో బాక్సాఫీస్ వద్ద తన మార్కెట్ ను క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు. ఇటీవల కాలంలో పాన్ ఇండియా సినిమాలకు మంచి గుర్తింపు లభిస్తున్న విషయం తెలిసిందే. కంటెంట్ జనాలకు ఏ మాత్రం కనెక్ట్ అయినా కూడా సినిమా భాషతో సంబంధం లేకుండా చూస్తున్నారు. మరి రాబోయే విక్రాంత్ రోణ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











