ఆ రూట్లో భారీ ఆఫర్ వచ్చిన టెంప్ట్ అవ్వని మెగాస్టార్ చిరంజీవి.. గుడ్ డిసిషన్?

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్రహీరోలు ఒకరిని మించి మరొకరు సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. నేటి తరం హీరోల కంటే కూడా సీనియర్ హీరోలు అయితే ఎక్కువ సంఖ్యలో సినిమాలను లైన్లో పెడుతుండడం విశేషం. గతంలో ఎప్పుడూ లేని విధంగా మెగాస్టార్ చిరంజీవి సైతం ఒకేసారి నాలుగు ప్రాజెక్టులను సెట్స్ పైకి తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన మరింత బిజీ కానున్నట్లు తెలుస్తోంది. ఆచార్య సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగా హీరో రామ్ చరణ్ తేజ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటించాడు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మెగాస్టార్ ఎక్కువగా గాడ్ ఫాదర్ సినిమాను ఫినిష్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అలాగే బోళా శంకర్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా కమర్షియల్ పంథాలో అభిమానులకు నచ్చే విధంగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. అలాగే ప్రతి సినిమాలో కూడా సందేశం కూడా ఉండాలని జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

Megastar chiranjeevi rejected a big offer from ott company

అయితే ఈ రోజులలో ఓటీటీ కంపెనీలు కూడా అగ్రహీరోలతో వర్క్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇప్పటికే నాగార్జున వెంకటేష్ రానా దగ్గుబాటి వంటి వాళ్లు కూడా ఆ రూట్లో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా త్వరలో ఒక వెబ్ సిరీస్ లో కనిపించబోతున్నట్లు ఇటీవల కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్ ఆఫర్ చేసినప్పటికీ ఆయన ఒప్పుకోలేదని టాక్ వస్తోంది.

ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా థియేటర్స్ సినిమాలు చేయాలని ఒక మంచి ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. ముందు థియేటర్స్ లోనే విడుదలయ్యేలా సినిమాలు రెడీ చేసే విధంగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ భవిష్యత్తులో పరిస్థితులను బట్టి ఒకవేళ అవకాశం ఉంటే వెబ్ సిరీస్ లో నటించవచ్చు అని తన ఆలోచనలు ఓపెన్ గా చెప్పేశారట. ఇక ఇప్పటికే మహేష్ బాబు కూడా అదే తరహాలో తన ఆలోచనలు ఓపెన్ గా చెప్పేశాడు. వీలైనంత వరకు మన స్టార్ హీరోలు మాత్రం ఓటీటీ లకు అలవాటు పడకుండా థియేటర్ బిజినెస్ మళ్లీ ట్రాక్ లోకి తేవాలని చూస్తున్నారు.

అందుకే ఎన్ని ఆఫర్స్ వచ్చినా కూడా అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే కామెడీ దర్శకుడు మారుతి, కమర్షియల్ మాస్ దర్శకుడు సంపత్ నందిలతో కూడా సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే భవిష్యత్తు ప్రాజెక్టులపై మెగాస్టార్ మరింత క్లారిటీ ఇవ్వనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X