చిరంజీవిపై విషప్రయోగం నిజమేనా? 38 ఏళ్ల నాటి ఘటనపై మెగాస్టార్ క్లారిటీ.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన నటుడు చిరంజీవి. ఆయన తన కష్టాన్ని, తన టాలెంట్ ను మాత్రమే నమ్ముకున్నారు. ఆయన సినీ ప్రయాణం ఎన్నో కష్టనష్టాలు, విమర్శలు, అవాంతరాలు. అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ ఒక్కో మెట్టు ఎక్కి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. టాలీవుడ్‌లో సుప్రీమ్ హీరో స్థాయి నుంచి మెగాస్టార్‌గా ఎదిగారు. అయితే ఆయన కెరీర్‌లో ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన "విషప్రయోగం"ఘటన గురించి తాజాగా చిరంజీవి స్పందించి అసలు విషయాన్ని వెల్లడించారు. దాదాపు 38 ఏండ్ల క్రితం ఏం జరిగింది? ఘటనపై చిరంజీవి ఏమన్నారంటే?

టీవల ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి పాల్గొన్నారు. ఈ సమయంలో "మీపై ఒకప్పుడు విషప్రయోగం జరిగిందని ప్రచారం జరిగింది.అది నిజమేనా?" అని ప్రశ్నించారు. ఈ విషయంపై మెగాస్టార్ స్పందించారు. అందులో కొంత నిజం ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నంత పెద్ద కుట్ర కాదని స్పష్టం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. మరణ మృదంగం (1988)సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది.చెన్నైలోని గిండి హార్స్ క్లబ్‌లో షూటింగ్ జరుగుతుండగా, ఓ అభిమాని తన పుట్టినరోజు అని నన్ను కలవడానికి వచ్చాడు. షూటింగ్ స్పాట్‌లో తాను చెప్పిన కేక్ ను నాతో కేక్ కట్ చేయించి, స్వయంగా కేక్ తినిపించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నేను వద్దని చెప్పిన వినిపించుకోలేదు' అన్నారు.

Megastar Chiranjeevi Reveals Truth Behind Viral Poisoning Rumours After 38 Years of Speculation

'అయితే ఆ అభిమాని బలవంతంగా కేక్ ముక్కను నోట్లో పెట్టడంతో ఏదో తేడాగా అనిపించింది. కేక్‌లో కొంత చేదు రుచి రావడంతో వెంటనే అనుమానం వచ్చింది. దానిని వెంటనే ఉంచేశాను. కేక్ లోపల ఏదో అదనపు పౌడర్ కలిపినట్లు కనిపించడంతో అక్కడున్న నిర్మాత కె.ఎస్. రామారావు సహా యూనిట్ సభ్యులు అప్రమత్తమయ్యారు' అని తెలిపారు. వెంటనే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేక్‌ను పరీక్షల కోసం పంపించారు. పరీక్షల్లో కేక్‌లో ఒకరకమైన పౌడర్ ఉన్నట్లు తేలిందని, అయితే అది ఏ పదార్థమో స్పష్టంగా తెలియలేదని చిరంజీవి వివరించారు. దీంతో అప్పట్లో అది విషమేమో అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయం బయటకు రావడంతో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే విచారణలో ఆ అభిమాని చెప్పిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. "చిరంజీవి గారు ఇటీవల నాతో అంతగా మాట్లాడటం లేదు. మా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తితో ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందుకే ఆయన మళ్లీ నన్ను దగ్గర చేసుకోవాలని కేరళ నుంచి వశీకరణం కోసం ఒక పౌడర్ తీసుకొచ్చాను. దానిని కేక్‌లో కలిపాను"అని చెప్పాడట. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి నవ్వుతూ స్పందించారు. "అది విషప్రయోగం కాదని నేను అప్పుడే కొట్టి పారేశాను. ఆ వ్యక్తి చేసిన పని మూర్ఖత్వమే తప్ప, నన్ను చంపాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నం కాదు. అతని అమితమైన అభిమానం, అవగాహన లేమి వల్ల అలా చేశాడు. విషప్రయోగం అనే ప్రచారానికి తర్వాత చిలవలు, పలవలు జతచేసి పెద్ద కథగా మార్చేశారు" అని చిరంజీవి వివరించారు.

ఇప్పటి వరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ వీడియోల్లో ఈ ఘటనను 'చిరంజీవిపై విషప్రయోగం'గా ప్రచారం చేస్తూ వచ్చారు. అయితే తాజాగా మెగాస్టార్ స్వయంగా స్పందించడంతో 38 ఏళ్లుగా ప్రచారంలో ఉన్న అనేక సందేహాలకు తెరపడినట్టు అయింది. అసలు విషయాన్ని వెల్లడిస్తూ అది హత్యాయత్నం కాదని, ఓ అభిమాని చేసిన అవివేకపూరిత చర్య మాత్రమేనని చిరంజీవి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో మెగాస్టార్‌కు సంబంధించిన ఈ పాత ఘటన మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X