రాయలసీమలో సైరా నరసింహారెడ్డి!
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి చిత్ర షూటింగ్ ఓ కొలిక్కి వస్తోంది. ఈ ఏడాది సమ్మర్ లో సైరా విడుదల కానున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. స్వాతంత్ర సమరం నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజగా ఈ చిత్ర షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సైరా నరసింహారెడ్డి చిత్ర యూనిట్ గత ఏడాది జార్జియా, హైదరాబాద్ నగర శివారులో నిర్మించిన సెట్ లో పలు సన్నివేశాల చిత్రకరణ జరుపుకుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ రాయలసీమ విలేజ్ సెట్ లో జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు రామోజీ ఫిలిం సిటీలో భారీ విలేజ్ సెట్ నిర్మించారట.

సైరా చిత్రంలో ప్రధాన నటులు చిరంజీవి, బాలీవడ్ మెగాస్టార్ అమితాబ్, నయనతార, జగపతి బాబు, విజయ్ సేతుపతి మధ్య కీలక సన్నివేశాల చిత్రీకరణ ఈ సెట్ లో జరగనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు సురేందర్ రెడ్డి పక్కా ప్లానింగ్ తో షూటింగ్ పూర్తి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఈ తరహా చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. గత ఏడాది విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











