ఆ బాలీవుడ్ స్టార్ హీరోతో మెగాస్టార్ డ్యాన్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన చిరు!

మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ కూడా ఆయన నుంచి రాబోయే తదుపరి సినిమా మాత్రం తప్పకుండా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంటుంది అనేది ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఒక బలమైన నమ్మకం అయితే ఉంది. ఇక మెగాస్టార్ కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా గాడ్ ఫాదర్ సినిమాతో రెడీ అవుతున్నాడు. మలయాళం లో మంచి సక్సెస్ అందుకున్న లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఫాదర్ సినిమాలో మెగాస్టార్ గతంలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త లుక్ తో కనిపించబోతున్నాడు.

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ కూడా అభిమానులకు అయితే మంచి కిక్ ఇచ్చింది. ఇక రీసెంట్ గా మెగాస్టార్ సినిమాకు సంబంధించిన మరొక కీలకమైన అప్డేట్ అయితే ఇచ్చారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే అతని క్యారెక్టర్ తో పాటు అతనితో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే డాన్స్ కూడా ఊహించిన విధంగా ఉంటుందట. ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రాఫర్ గా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ కాంబినేషన్లో ఒక సాంగ్ రాబోతోంది.

Megastar chiranjeevi shared interesting update on godfather movie dance

ఇక ఆ సాంగ్ కు ఫ్యాన్స్ లో పూనకాలు రావడం కాయం అనే లెవెల్లో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అప్డేట్ అయితే ఇచ్చారు. గాడ్ ఫాదర్ సినిమాలో ప్రభుదేవా కొరియోగ్రఫీలో రూపొందుతున్న ఒక సాంగ్లో సల్మాన్ ఖాన్ భాయ్ తో లెగ్స్ షేక్ చేయడం ఆనందంగా ఉంది అని.. ఇది కనుల విందుగా ఉండబోతోందని కచ్చితంగా చెప్పగలను అని మెగాస్టార్ చిరంజీవి క్లారిటీ అయితే ఇచ్చారు. ఇక ఆ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏదేమైనప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమాపై అంచనాలను పెంచే విధంగానే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఓపెనింగ్స్ అందుకుంటుందో చూడాలి. ఇక మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా టైమ్ లో విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X