Happy Mothers Day: తల్లికి గొడుగు పట్టిన మెగాస్టార్.. అలా అండగా నిలిచిన పవన్ కళ్యాణ్..(వీడియో)
మెగాస్టార్ చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఎనలేని స్థాయిలో గుర్తింపు అందుకున్నారు. ఇక ఆయన తర్వాత వచ్చిన నాగబాబు అనుకున్నంత స్థాయిలో హీరోగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ సహా నటుడిగా బాగానే క్రేజ్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మాత్రం స్టార్ హోదా ను చాలా బలంగా నిలబెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్.. ఇలా అందరూ కూడా మెగా యువ హీరోలు చాలా విజయవంతంగా కొనసాగుతున్నారు. అయితే అందరికీ కూడా మెగా అంజనాదేవి అంటే ఒక ప్రత్యేకమైన ఆప్యాయత అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
మెగా సోదరులను జన్మనిచ్చిన అంజనాదేవి అంటే అభిమానులకు కూడా ఒక తల్లి తో సమానం. ఆ విషయాన్ని అభిమానులే చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఒక విధంగా ఆమెకు కూడా అభిమానులు ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు. అయితే మెగాస్టార్ చిరంజీవి తన తల్లిని ఎంత బాగా ఇష్టపడతారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎక్కువగా తల్లి దగ్గరే ఉంటూ ఆమెకు ప్రత్యేకంగా వంట చేసి తినిపించిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
ఇక తల్లి పుట్టిన రోజు వేడుకలను కూడా మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబు ప్రత్యేకం గా సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే నేడు మాతృ దినోత్సవ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ వీడియోను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అమ్మలందరికీ అభివందనములు అంటూ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసుకున్న వీడియోలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. అలాగే నాగబాబు కూడా మెగా బ్రదర్స్ తో కలిసి ప్రత్యేకంగా భోజనం చేయడం జరిగింది.
షూటింగ్ స్పాట్ లోనే తల్లి తోనే ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఆనందం గా కొంతసేపు టైం స్పెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకవైపు చిరంజీవి వరుస షూటింగ్ లతో బిజీగా ఉండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా రాజకీయాల్లో సినిమా షూటింగ్లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరూ కూడా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి తల్లి కోసం మాతృ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా సమయాన్ని గడిపారు. ఆ వీడియోలో మెగాస్టార్ చిరంజీవి తల్లికి ప్రత్యేకంగా గొడుకు పడుతూ ఉండగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన తల్లిని పట్టుకొని నడిపిస్తున్నట్లు ఉన్న విజువల్స్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇద్దరు వాళ్ళ తల్లి ని కారులో ఎక్కిస్తూ ఉండడం మిగతా వారికి కూడా ఎంతో స్ఫూర్తిగా నిలుస్తోంది. తల్లిని మెగా హీరోలు ఎంత బాగా గౌరవించుకుంటారో ఈ వీడియో ద్వారా మరోసారి అర్థమవుతోంది. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బోళా శంకర్ సినిమా షూటింగులో బిజీగా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ను ఇటీవల స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మరో ఈ ఇద్దరు హీరోలు మరో రెండు సినిమాలను కూడా త్వరలోనే స్టార్ట్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











