అది వాళ్ళ యొక్క నీచత్వం.. నన్ను ఏం చేయలేరు: మెగాస్టార్ షాకింగ్ కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు కూల్ గా ఉండేందుకే ప్రయత్నం చేస్తారు. కోపం వచ్చిన సందర్భాల్లో మెగాస్టార్ ఎవరు ఊహించని విదంగా దర్శనమిస్తుంటారు. ఇకపోతే రీసెంట్ గా ఆయన మరొకసారి తనలోని ఒక ఆగ్రహ జ్వాలను కూల్ గా బయటపెట్టారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ట్రోలింగ్స్ పై ఈ విధంగా స్పందించారు.

మెగాస్టార్ మాట్లాడుతూ.. 'నేను సోషల్ మిడియాలోకి వచ్చినట్లు తెలుసుకున్న కొందరు నాకు ఒక విషయం చెప్పారు. మీరు అందులో వచ్చే కొన్ని ట్రోలింగ్స్ చూసి తట్టుకోలేరు. చాలా బాధపడతారని అన్నారు. కానీ నేను అలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోను. నా అనుమతి లేకుండా నన్ను ఎవరు బాదించలేరు. అలా ట్రోల్ చేస్తే.. అది వారి యొక్క నీచత్వం.. నన్ను ట్రోల్ చేసుకున్నా, నాపై ఏవైనా రూమర్స్ క్రియేట్ చేసినా నేను పట్టించుకోను' అని అన్నారు.

Megastar chiranjeevi shocking comments on trolling

అదే విధంగా తన అనుమతి లేకుండా ఎవరు కూడా నన్ను బాదించలేరని, నన్ను బాధపెట్టే విధంగా ఎవరు ఏం చేయలేరని మెగాస్టార్ తెలిపారు. ఇక ఎలాంటి ట్రోల్స్ వచ్చినా ఈజీగా తన మనసును ప్రశాంతంగా ఉంచుతానని అన్నారు. మెగాస్టార్ ఇచ్చిన కౌంటర్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతున్నాయి. ట్విట్టర్ , ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్టులు చేస్తూ ఆడియేన్స్ కి మంచి కిక్కిస్తున్న మెగాస్టార్ నెక్స్ట్ ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X