మీ దర్శకత్వంలో నటించడం నా అదృష్టం.. అగ్ర దర్శకుడికి మెగాస్టార్ స్పెషల్ విషెస్
మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో ఇతర సమస్యలపై తనదైన శైలిలో చర్చలు జరుపుతూనే మరోవైపు తన సినిమాలతో బిజీగా మారుతున్నారు. ఇక తన సినీ ప్రయాణంలో ఎంతోమంది దర్శకులతో వర్క్ చేసిన మెగాస్టార్ వారికి సంబంధించిన విషయాల్లో అవసరం అయినప్పుడు భాగం అవుతున్నారు. ఇక రీసెంట్ గా మెగాస్టార్ లెజండరీ డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతే కాకుండా ఆయనతో వర్క్ చేసిన అనుభవాన్ని కూడా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. కె.విశ్వనాథ్ తో గతంలో దిగిన ఒక ఫొటోను కూడా ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో గర్వించదగ్గ అతికొద్ది మంది మంచి దర్శకులతో కళాతపస్వి కె.విశ్వనాథ్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమాను డైరెక్ట్ చేసినా కూడా అందులో ఎదో ఒక మంచి సందేశం ఉంటుంది. వీలైనంత వరకు ఆయన చిత్రాల్లో ఎక్కువగా తెలుగు సాంప్రదాయం గౌరవం ఖ్యాతి ఉట్టి పడేలా ఉంటాయి. శంకరాభరణం సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు అందుకొని తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచారు. సాగర సంగమం, స్వాతిముత్యం, స్వర్ణ కమలం, సిరి వెన్నెల, స్వయం కృషి, ఆపద్బాంధవుడు ఇలా ఎన్నో వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించి దర్శకత్వం అనే శాఖకు ఒక ప్రత్యేకమైన గౌరవం తీసుకు వచ్చారు.

హిందీలో కూడా పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక నేడు కె.విశ్వనాథ్ 92వ పుట్టినరోజు సందర్భంగా సినీ.ప్రముఖులు అభిమానులు ఆయనకు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విషెస్ అందిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రత్యేకమైన పోస్ట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. ''గురు తుల్యులు, కళాతపస్వి కె . విశ్వనాథ్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు! తెలుగు జాతి, తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసి, తెలుగు సినిమా చరిత్ర శంకరాభరణం ముందు, శంకరాభరణం తర్వాత, అనేలా చేసిన మీరు తెలుగు వారందరికీ అందిన వరం! మీ చిత్రాలు అజరామరం! మీ దర్శకత్వం లో నటించడం నా అదృష్టం! మీరు కలకాలం ఆయురారోగ్యాలతో సంతోషం గా వుండాలని ఆ భగవం తుడిని కోరుకుంటున్నాను.." అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఇక.మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఆ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆ తరువాత గాడ్ ఫాదర్ సినిమా కూడా ఇదే ఎడాది విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు తుది దశకు చేరుకుంది. ఇక ఇటీవల మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ బోళా శంకర్ అనే సినిమాను స్టార్ట్ చేశాడు. తమిళ్ హిట్ మూవీ వేదళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ సోదరిగా కీర్తి సురేష్ నటిస్తుండగా మేయిన్ హీరోయిన్ గా తమన్నా నటిస్తుంది. అలాగే వెంకీ కుడుముల, బాబీ సినిమాలను కూడా మెగాస్టార్ లైన్ లో పెట్టారు.


Click it and Unblock the Notifications











