నాటు నాటు టాలెంట్ కు మెగాస్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్.. అన్నయ్య ప్రేమకు చంద్రబోస్ ఫిదా..
మెగాస్టార్ చిరంజీవి సరికొత్త టాలెంట్ ఎవరిలో ఉన్నా కూడా సపోర్ట్ చేయడంలో ఎల్లప్పుడూ కూడా ముందుంటారు. ఇక ఆయన అవకాశాలు ఇవ్వడంలో కూడా ఎప్పుడు ముందుంటారు. టాలెంట్ ఉంది అంటే వారు ఎంత చిన్న స్థాయిలో ఉన్నా కూడా ఆయన భుజం తట్టి సపోర్ట్ చేస్తూ ఉంటారు. మెగాస్టార్ సినిమా కెరిర్ లో చాలామంది పాటల రచయితలకు సపోర్ట్ గా నిలిచారు అనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబోస్ కూడా ఆయనకు పిలిచి మరీ చాలా సార్లు అవకాశాలు ఇచ్చారు.
ఇక ఇటీవల నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్ లో నిలవడంతో మెగాస్టార్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా చిత్ర యూనిట్ సభ్యులందరికీ కూడా విషెస్ అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఆ పాటను రచించిన గేయ రచయిత చంద్రబోస్ కు ప్రత్యేకంగా ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపించారు. ప్రియమైన చంద్రబోస్ కి నా శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ చిరంజీవి సాహిత్య గణపతిని పంపించడంతో అందుకు చంద్రబోస్ ఎంతగానో సంతోషించారు.

ఇక ఆ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో కూడా తెలియజేశారు. అన్నయ్య చిరంజీవి గారు నాకు బహుమతిగా పంపించిన సాహిత్య గణపతి.. అంటూ చంద్రబోస్ ప్రత్యేకంగా మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రస్తుతం చాలామంది తెలుగు ప్రేక్షకులు అయితే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన నాటు నాటు పాట అవార్డును సొంతం చేసుకోవాలి అని కోరుకుంటున్నారు.
ఇక మరోవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో విజయోత్సవంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తర్వాత ఆయన భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అందులో కూడా చంద్రబోస్ రెండు పాటలకు తన రచనను అందించారు. ఆ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మేహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమా ఈ ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











