మహేష్ బాబుకు కరోనా.. త్వరగా కోలుకోవాలి అంటూ మెగాస్టార్ యాక్షన్ ట్వీట్!

కరోనా వ్యాప్తి మరోసారి ఊపందుకుంది. సెకండ్ వేవ్ అనంతరం మెల్లగా తగ్గుతోంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక్కసారిగా వైరస్ తీవ్రత పెరుగుతోంది. న్యూ ఇయర్ నుంచి కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఓమిక్రాన్ వేరియెంట్ వైరస్ తీవ్ర స్థాయిలో కరోనా కేసుల సంఖ్యను మరింతగా పెంచుతోంది.. అయితే ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల కొంత అస్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఇక ఆ టెస్ట్ లో పాజిటివ్ రావడంతో వెంటనే సోషల్ మీడియా ద్వారా స్పందించి మిగతా వారిని కూడా అలెర్ట్ అయ్యేలా చేశారు.

అయితే మహేష్ బాబు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. మహేష్ బాబు సన్నిహితుల్లో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కూడా మహేష్ బాబు వీలైనంత త్వరగా కోలుకొని కోలుకోవాలి అని ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా మళ్లీ యాక్షన్ లోకి త్వరగా రావాలని కూడా పేర్కొన్నారు. మెగాస్టార్ చేసిన ట్వీట్ కి మహేష్ అభిమానులు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

megastar chiranjeevi special tweet on mahesh babu corona positieve

ఇక మహేష్ బాబు తనకు కరోనా పాజిటివ్ వచ్చింది అనగానే తన సన్నిహతులను అలెర్ట్ చేశాడు. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, తేలికపాటి లక్షణాలతో కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. ఇక ప్రస్తుతం నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నాను అంటూ మరియు వైద్య మార్గదర్శకాలను అనుసరిస్తున్నాననీ నన్ను సంప్రదించిన వారందరు కూడా టెస్ట్ చేయించుకోవాలి అని తెలిపారు. టీకా తీసుకోని వారు ప్రతి ఒక్కరు కూడా టీకా వెంటనే వేసుకోవాలని కోరుతున్నట్లు చెబుతూ.. ఎందుకంటే ఇది తీవ్రమైన లక్షణాలు లేకుండా ఆసుపత్రిలో చేరే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. దయచేసి కోవిడ్ నిబంధనలను అనుసరించాలని సురక్షితంగా ఉండాలని పేర్కొన్న మహేష్.. వీలైనంత త్వరగా మళ్ళీ వస్తాను అని అభిమానులకి శ్రేయోభిలాషులకు మహేష్ తెలియజేశారు.

megastar chiranjeevi special tweet on mahesh babu corona positieve

ఇక మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా RRR కరోనా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఏప్రిల్ ఒకటో తేదీన ఎలాగైనా సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సంక్రాంతి నుంచి ఈ సినిమాకు సంబంధించిన పాటలను కూడా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు క్లారిటీ కూడా ఇచ్చారు. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక SVP సినిమాలో మహేష్ బాబు ఒక బ్యాంక్ రికవరీ ఎంప్లాయ్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. సినిమా మొదటి భాగం అమెరికా బ్యాక్ డ్రాప్ లో చాలా ఎంటర్టైన్మెంట్ గా కొనసాగుతుందట. కీర్తి సురేష్ పాత్ర కూడా ఈ సినిమా చాలా లవ్లీ గా ఉంటుంది అని చెబుతున్నారు. కేవలం మాస్ అభిమానులకు నచ్చే విధంగానే కాకుండా ఒక మంచి సందేశం కూడా ఉంటుంది అని దర్శకుడు ఒక ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X