twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవి రక్తదానం.. ఇదొక గొప్ప అదృష్టం అంటూ..

    |

    మెగాస్టార్ చిరంజీవి కేవలం ఒక స్టార్ హీరోగానే కాకుండా ఎన్నో మంచి పనులతో కూడా అభిమానుల మనసుకు దగ్గరయ్యారు. ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ఉచితంగా రక్తదానం ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడారు. ఇక నేడు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా మెగాస్టార్ సతీసమేతంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేశారు.

    భార్య సురేఖతో కలిసి రక్తదానం అందిస్తున్న ఫొటోను కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. అంతే కాకుండా రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ఎంతోమందికి అభినందనలు తెలియజేశారు. రక్తదాతలు అందరినీ మరియు ముఖ్యంగా ప్రాణాలను రక్షించడంలో సహాయపడే నా బ్లడ్ బ్రదర్స్ & సిస్టర్స్ ను అభినందిస్తున్నాము. అటువంటి సరళమైన చర్యల ద్వారా మనం విలువైన ప్రాణాలను రక్షించగలము. అలాగే రక్తం ద్వారా జీవిత విశాల తోటి మానవులకు ఒక బంధాన్ని ఏర్పరుచుకోవడం గొప్ప అదృష్టం.. అని మెగాస్టార్ పేర్కొన్నారు.

    Megastar chiranjeevi special tweet on World Blood Donors Day

    కోవిడ్ 19 వలన అనేక మంది ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఇటీవల చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ను కూడా స్థాపించారు. ఆంద్రప్రదేశ్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి అవసరం అయిన వారికి ఆక్సిజన్ అందేలా చర్యలు తీసుకున్నారు. ఖర్చుకు ఏ మాత్రం వెనుకాడకుండా అవసరం ఉన్నన్ని రోజులు సహాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ ఆచారు షూటింగ్ కు ఫీనిషింగ్ టచ్ ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్నారు.

    English summary
    Megastar tweeted 'On this World Blood Donors Day congratulating all Blood Donors & particularly my BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood',
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X