క్రిస్మస్ తాత మాకిచ్చిన కానుక.. మెగాస్టార్ స్పెషల్ వీడియో వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తరువాత ప్రతి ఆనందాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి పండగ రోజున ఆయన అందరికి స్పెషల్ విషెస్ అందిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీలో చిన్న వేడుక జరిగినా కూడా మెగాస్టార్ నుంచే మొదటి పోస్ట్ వెలువడుతోంది.
శాంతాక్లాజ్ ( క్రిస్మస్ తాత ) క్రిస్మస్ రోజున మా కిచ్చిన గిఫ్ట్ అంటూ రీసెంట్ గా మెగాస్టార్ సోషల్ మీడియా ద్వారా ఒక స్పెషల్ వీడీయో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ రెండవ కుమార్తె నవిష్క పుట్టినరోజు కావడంతో తనకి స్పెషల్ విషెస్ అందించారు. క్రిస్మస్ తాత మాకిచ్చిన కానుక నవిష్క అని బర్త్ డే విషెస్ అందించారు. అందుకు సంబందించిన వీడీయో కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోందో.

ఇక మెగాస్టార్ ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్ చరణ్ కూడా అందులో స్పెషల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక లూసిఫర్ రీమేక్ తో పాటు మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ లో కూడా నటించనున్నారు. ఆ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి రానున్నాయి.


Click it and Unblock the Notifications











